బుధవారం, డిసెంబర్ 11, 2019
రాజమహేంద్రవరం నగరం, న్యూస్టుడే: ధవళేశ్వరం హెడ్ వర్క్స్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫఫ్లడ్ కంట్రోల్ రూం సేవలను శనివారంతో నిలిపివేసినట్లు హెడ్ వర్క్స్ ఈఈ, ఫ్లడ్ కన్జర్వేటర్ ఆర్.మోహన్రావు తెలిపారు. నిబంధనల మేరకు జులై ఒకట్నుంచి అక్టోబరు 31వ తేదీ వరకు ఏటా ఫ్లడ్ కంట్రోల్ రూం ఉంటుందన్నారు. ఈ ఏడాది వరదనీరు అనూహ్యంగా వస్తుండటంతో అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించేందుకు వీలుగా సేవలను మరో 15 రోజులు కొనసాగించామన్నారు. బ్యారేజీ వద్ద శనివారం 10.90 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. బ్యారేజీ వద్దకు 30 వేల క్యూసెక్కుల నీటి చేరిక ఉందన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు