close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

క్రైమ్

గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు  

● జిల్లా ఎస్పీ నయీం అస్మి వెల్లడి

 పోలీసుశాఖ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్‌ పోటీలు


విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందిస్తున్న ఎస్పీ

 

గుర్తేడు, (మారేడుమిల్లి): మన్యంలోని గిరిజన గ్రామాల అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పనకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి పేర్కొన్నారు. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని గుర్తేడులో శనివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత ఈ పోటీలను ఓఎస్డీ ఆరిఫ్‌హఫీజ్‌ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గిరిజన యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. గిరిజన యువతకు అన్ని రంగాల్లోనూ అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ఇక్కడి యువత పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. ఈ పోటీల్లో వివిధ గ్రామాలకు చెందిన 75 జట్లు పాల్గొన్నాయి. ఆయా జట్లకు టీ-షర్టులు, వాలీబాల్‌ కిట్లను పంపిణీ చేశారు. క్రీడాకారులకు వాహన సదుపాయంతో పాటు, భోజన వసతి కల్పించారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఏఎస్పీ వకుల్‌జిందాల్‌, మారేడుమిల్లి సీఐ రవికుమార్‌, మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు రామకృష్ణ, సతీష్‌, సిబ్బంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి బురదకోట, ద్వితీయ బహుమతి దుంపవలస జట్లు గెలుచుకున్నాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.