close

గురువారం, డిసెంబర్ 05, 2019

ప్రధానాంశాలు

అఖండ గోదారిలో సైకత సిరి

ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన మూడు కిలోమీటర్ల వరకు

లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వలున్నట్లు అంచనా

● సర్వే నిర్వహించేందుకు జలవనరుల శాఖ రంగం సిద్ధం

● టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో డ్రెడ్జింగ్‌ నిర్వహణలో జాప్యం

ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన అఖండ గోదావరి (డ్రోన్‌ చిత్రం)

రాజమహేంద్రవరం, ఈనాడు డిజిటల్‌ : అఖండ గోదావరిలో అపార ఇసుక నిల్వలున్నట్లు జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన మూడు కిలోమీటర్ల వరకు లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక పేరుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఇసుక నిల్వలను వెలికితీస్తే ఇతర జిల్లాలకు కూడా సరఫరా చేసేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గోదావరిలో డ్రెడ్జింగ్‌ నిర్వహించి చాలా సంవత్సరాలు కావడంతో ఇసుక మేటలు ఎక్కువగా పేరుకున్నాయి. గోదావరిలో ఎక్కడెక్కడ ..మిగతా 7లోఎంత పరిమాణంలో ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా సర్వే నిర్వహించాల్సి ఉంది. ఈమేరకు జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలో ఇసుక కొరతను తీర్చేందుకు బ్యారేజీ ఎగువన ఈ నెల 14 నుంచే డ్రెడ్జింగ్‌తో ఇసుక తవ్వకాలను చేపట్టేందుకు ఉన్నతాధికారులు అనుమతించినా టెండర్లు పూర్తి కాకపోవడంతో ఈ ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదు.బ్యారేజీ భద్రతా కమిటీ సూచనల మేరకు బ్యారేజీ దిగువన, ఎగువ మూడు కిలోమీటర్ల మేరకు ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. కానీ ఇక్కడ ఒక మీటరు లోతున డ్రెడ్జింగ్‌ చేపట్టేందుకు మాత్రం అభ్యంతరం లేక పోవడంతో దీనిపై ఉన్నతాధికారులు దృష్టి నిలిపారు.

చాలా నాణ్యమైనది

ఇసుక మేటలు వేసిన ప్రాంతంలో దాని నాణ్యత విలువ 2.5 ఎఫ్‌ఎంవీ (ఫైడ్‌నెస్‌ మాడ్యూస్‌ వేల్యూ)ఉంటుంది. ఇది గరుకుగా ఉండడం వల్ల భవన నిర్మాణాలకు చాలా మంచిదని ఇంజినీరింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఈ ఇసుకకు తీవ్ర డిమాండ్‌ ఉంటుంది. గోదావరి నది ప్రవహించే ప్రాంతాలన్నింటిలో ఉభయ గోదావరి జిల్లాల్లో దొరికే ఇసుక అంత్యంత నాణ్యమైంది. మిగిలిన ప్రాంతాల్లో దొరికే ఇసుక ప్లాస్టింగ్‌, పునాదుల్లో నింపేందుకు వాడతారు. చాలా కాలం నుంచి గోదావరిలో అపారమైన ఇసుక నిల్వలు పేరుకుపోయాయి. గతంలో డ్రెడ్జింగ్‌ ద్వారా కొంతమేరకు ఇసుకను వెలికి తీశారు. . ప్రస్తుతం ఇసుక నిల్వలను బయటకు తీయడం వల్ల లాభామే కాని ఎలాంటి నష్టం ఉండదు. అయితే డ్రెడ్జింగ్‌ నిర్వహించే సమయంలో స్ట్రక్చర్లకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలి. జలవనరుల శాఖ, ఖనిజాభివృద్ధి సంస్థ పర్యవేక్షణ అంత్యంత అవసరం. ఇటీవల ఏపీఆర్‌ఎల్‌ ల్యాబ్‌ ప్రతినిధులు కూడా పరిశీలించి వెళ్లారు. -విపర్తి వేణుగోపాల్‌, విశ్రాంత పర్యవేక్షక ఇంజినీరు, ధవళేశ్వరం సర్కిల్‌

సర్వే కోసం ప్రతిపాదనాలు పంపాం

గోదావరిలో ఇసుక నిల్వలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. గత ఏడాదే డ్రెడ్జింగ్‌ చేపట్టాల్సి ఉండగా వాయిదా పడింది. ప్రస్తుతం దీనిని చేపటేటందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఇసుక కొరత ఉన్న నేపథ్యంలో ఈ నిల్వలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. -ఎన్‌.కృష్ణారావు, పర్యవేక్షక ఇంజినీరు, ధవళేశ్వరం సర్కిల్‌

 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.