ఆదివారం, డిసెంబర్ 08, 2019
కమాన్‌పూర్, న్యూస్‌టుడే: జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో ఐదు చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గొల్లపల్లిలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రైతులు పండించిన నాణ్యమైన పత్తి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.5550 ప్రకటించామన్నారు. జిల్లాలో ఎనిమిది జిన్నింగ్ మిల్లులు ఉండగా ఇందులో ఐదింటిలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే రెండు చోట్ల కేంద్రాలను ప్రారంభించామన్నారు. 8-12 శాతం తేమ కలిగిన పత్తిని మాత్రమే సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. 8 శాతం కంటే తేమ తక్కువగా ఉంటే మద్దతు ధర లభిస్తుందన్నారు. పత్తి నాణ్యత, తేమశాతం ఆధారంగా మద్దతు ధర నిర్ణయిస్తామన్నారు. 12 శాతం కంటే తేమ ఎక్కువగా ఉండే కొనుగోలు చేయడం వీలుకాదని వెల్లడించారు. పత్తిని విక్రయించే రైతులు పట్టాపాసు పుస్తకాలు, ఆధార్‌కార్డు, రైతు గుర్తింపు కార్డు, బ్యాంక్ అకౌంట్‌ను తీసుకురావాలన్నారు. కొనుగోలు చేసిన అనంతరం అంతర్జాలం ద్వారా ఐదు రోజుల్లో డబ్బులు జమవుతాయని వివరించారు. ఆయన వెంట సీసీఐ కొనుగోలు అధికారి నీమ్జే ఉన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు