శనివారం, డిసెంబర్ 07, 2019
జగిత్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: శ్రీరాంసాగర్ జలాశయానికి ఆదివారం వరకు 2,144 క్యూసెక్కుల చొప్పున వరదనీరు వచ్చి చేరుతుండగా ఔట్‌ఫ్లో 577 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 90.313 టీఎంసీలకు గాను ప్రస్తుతం 89.763 టీఎంసీల నీరు నిలువ ఉంది. గత సంవత్సరం సరిగ్గా ఇదే తేదీన ప్రాజెక్టులో 34.614 టీఎంసీలుగా ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 164 టీఎంసీల వరదనీరు ఎస్సారెస్పీలోకి వచ్చి చేరింది.
తాజా వార్తలు
జిల్లా వార్తలు