close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

నత్తనడక నిర్మాణం.. భక్తులకు అగచాట్లు

పూర్తికాని వెంకట్రావుపేట గంగా గౌరీశ్వర ఆలయం

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: ‘పవిత్ర గోదావరి తీరంలో వెలసి భక్తుల పాలిట కల్పతరువుగా, కోరిన కోర్కెలు తీర్చే వెంకట్రావుపేట గంగ గౌరీశ్వర దేవస్థానం ఆలయ నిర్మాణం పూర్తి కాకపోవడంతో బుధ, శుక్రవారాల్లో మొక్కులను చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. గత పుష్కరాల సందర్భంగా గోదావరి నదిలో రెండు చోట్ల స్నానాల కోసం మెట్లు, ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. దీంతో ఇబ్బందులు తొలగిపోతాయని భక్తులు భావించారు. పనులు చేపట్టిన గుత్తేదారుకు సకాలంలో బిల్లులను చెల్లించకపోవడంతో పనులు అర్థంతరంగా నిలిపివేయడంతో స్లాబ్‌ దశలోనే పనులు నిలిచిపోయాయి.

మల్లాపూర్‌ మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఘన చరిత్ర కలిగిన గంగా గౌరీశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. 2015 పుష్కరాల సమయంలో ప్రభుత్వం రూ.25లక్షల వ్యయంతో ఆలయాన్ని పునర్నిర్మిచండానికి ముందుకు వచ్చింది. అదే సంవత్సరం జూన్‌లో గుత్తేదారు పనులు ప్రారంభించార[ు. అప్పటి నుంచి రెండు నెలల పాటు పనులు కొనసాగాయి. అదే సమయంలో పుష్కరాలు సమీపించడంతో  భక్తులు నిర్మాణ పనుల వల్ల ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పుష్కరాల ప్రారంభానికి ఒక రోజు ముందు దేవాదాయశాఖ పనులను నిలిపివేసింది. అప్పట ¨వరకు దాదాపు రూ.13 లక్షల మేర పనులు పూర్తయ్యాయి. నిధులను  వేములవాడ రాజరాజేశ్వరుని ఆలయం నుంచి కేటాయింపు జరిపారు. అంతే ఇక అప్పటి నుంచి ఈ ఆలయ నిర్మాణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఐదేళ్లు గడుస్తున్నా ఇది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. పష్కరాల అనంతరం ప్రభుత్వ దీని ఊసే మరిచింది. ఆలయ నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోవడంతో భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడి అసౌకర్యాలే అడుగడుగునా స్వాగతం పలుకుతున్నాయి. దర్శనం అనంతరం గుడిలో కాసేపు ప్రశాంతంగా కూర్చోడానికి కూడా వీలు లేని పరిస్థితి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు వస్తే గుడి చుట్టూ ప్రదక్షణలు చేయడానికి సైతం వీలులేని పరిస్థితి. కాళ్లకు రాళ్లు, ముళ్లు గుచ్చుకోకుండా జాగ్రత్తగా ప్రదక్షణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. భక్తులు స్నానాలు చేసే పుష్కరఘాట్‌లో ప్రమాద హెచ్చరిక బోర్డులు, నీటిలో కొట్టుకుపోకుండా రక్షణ జాలీలను ఏర్పాటు చేయలేదు. దీంతో తెలియని వారు నీటిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆలయ ఆవరణలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. గుడి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి సౌకర్యాలు మెరుగు పరుచాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల మనోభావాలు గౌరవించి దేవాదాయశాఖ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఆలయ పునర్నిర్మాణంతో పాటు ఆలయ అవరణలో షెడ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. గురు, శుక్రవారాల్లో ఆలయ అవరణ పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.