బుధవారం, డిసెంబర్ 11, 2019
రాంనగర్, న్యూస్‌టుడే: తెలంగాణ ఆర్టీసీ ఐకాస కో-కన్వీనర్ జి.లింగమూర్తి ఆదివారం రాంనగర్ డివిజన్లోని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సమ్మెకు మద్దతుగా దీక్ష కొనసాగించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్, సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు సుధాకర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్రావు, భాజపా నాయకులు బి.మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు ఇందిర, ప్రొ.విశ్వేశ్వరావు, రైతు సంఘం నాయకుడు జంగారెడ్డి తదితరులు అతని వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ ఐకాస నాయకులను చర్చలకు పిలవాలన్నారు. కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలన్నారు. సీఐటీయూ నాయకులు ఎస్.వీరయ్య, ఏవీ రావు, రవీందర్‌రెడ్డి, సాంబశివ, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు