close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

ప్రభుత్వం స్పందించకుంటే ప్రగతిభవన్‌ ముట్టడి: సీపీఐ

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం స్పందించకుంటే ప్రగతిభవన్‌ను 48 గంటల పాటు దిగ్బంధిస్తామని సీపీఐ నగర కమిటీ పేర్కొంది. ఆదివారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్‌లో నిర్వహించిన పార్టీ నగర కమిటీ సమావేశంలో కార్యదర్శి ఇ.టి.నర్సింహ మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండిపట్టు వీడి కార్మిక సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించాలని కోరారు. చట్టబద్ధంగా చేస్తున్న సమ్మె పట్ల ఆంక్షలు విధిస్తూ నిర్బంధం కొనసాగించడం సరికాదని విమర్శించారు. సమ్మె వల్ల విద్యార్థులు మొదలుకొని చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు అవస్థలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ, ఎం.నర్సింహ, అఖిల భారత మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఛాయాదేవి, సీపీఐ నాయకులు బొడ్డుపల్లి కిషన్‌, హసీనాబేగం, లక్ష్మి, అంజుమ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.