close

గురువారం, డిసెంబర్ 05, 2019

ప్రధానాంశాలు

దేశవ్యాప్తంగా బ్రాహ్మణుల ఐక్యతను చాటాలి

జాతీయ సదస్సులో వక్తలు

మీర్‌పేట, న్యూస్‌టుడే: దేశంలో బ్రాహ్మణుల ఐక్యతను చాటాలని వక్తలు పేర్కొన్నారు. ఆల్‌ ఇండియా బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బాలాపూర్‌ మండలం బడంగ్‌పేటలో నిర్వహిస్తున్న బ్రాహ్మణ జాతీయ సదస్సు ముగింపు సమావేశం ఆదివారం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న బ్రాహ్మణ జేఏసీ నాయకులతో పాటు ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌.ఇంద్రసేనారెడ్డి, ఉత్తరప్రదేశ్‌ డీఐజీ జుగల్‌కిషోర్‌, ప్రముఖ సినీ నటులు చంద్రమోహన్‌ తదితరులు ప్రసంగించారు. కార్తిక సమారాధన సందర్భంగా సదస్సు నిర్వహించడం శుభసూచకమన్నారు. అగ్రవర్ణ పేదల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 10శాతం రిజర్వేషన్లను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఇక నుంచి ఏటా సదస్సులు నిర్వహించాలని తీర్మానించారు. బడంగ్‌పేట బ్రాహ్మణ సేవా సమితి, శ్రీవాణి గాయత్రి సేవా ట్రస్ట్‌, బాలాపూర్‌ మండల బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం సహకారంతో నిర్వహించిన సదస్సులో శంకర్‌నారాయణ హాస్యవల్లరి, శ్రావణి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభావతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జేఏసీ ఛైర్‌పర్సన్‌ గీతామూర్తి, గౌరవ ఛైర్మన్‌ రమాశంకర్‌ వందన సమర్పణతో సదస్సు ముగిసింది.  ప్రముఖ గాయని మాళవిక, దివ్యజ్ఞాన సిద్ధాంతి, దివ్యారమణచక్రవర్తులు, జేఏసీ రాష్ట్ర కమిటీ ఛైర్మన్‌ గోపికృష్ణమాచార్యులు, కోశాధికారి పగిడిమర్రి శ్రీనివాస్‌శర్మ, ఉపాధ్యక్షులు రామ్మోహన్‌రావు, సత్యనారాయణమూర్తి, రాధాసుధ, భీమ్‌సేన్‌మూర్తి, సినీ నటులు కేదార్‌శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.