సోమవారం, డిసెంబర్ 09, 2019
మాదాపూర్ న్యూస్టుడే: వారాంతంలో భాగంగా ఆదివారం సాయంత్రం శిల్పారామంలో కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. బెంగూళూరుకు చెందిన నాట్యగురువు శివానీశివకుమార్ చూడముచ్చటైన భరతనాట్యంతో కళాప్రియులను అలరించారు. చక్కటి హావభావాలతో లయబద్దంగా ఆమె ప్రదర్శించిన నృత్యాంశాలు కనువిందుగా సాగాయి. అనంతరం నిర్మాలయ సంస్థకు చెందిన విద్యార్థులు ఒడిస్సీ నృత్యప్రదర్శనతో అలరించారు. ముఖ్యంగా వారు ప్రదర్శించిన కృష్ణవందన నృత్యరూపకం నయనానందకరంగా సాగింది.
తాజా వార్తలు
జిల్లా వార్తలు