బుధవారం, డిసెంబర్ 11, 2019
పెద్దపల్లి, న్యూస్‌టుడే: పత్తి మిల్లుల యజమానులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఇన్సెంటివ్‌లు, పీనల్ ఛార్జీల విధింపు తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో పత్తి కొనుగోళ్లను నిర్వహించేందుకు కాటన్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయమే కొనుగోళ్ల నిలిపివేత నిర్ణయాన్ని అసోసియేషన్ ఉపసంహరించుకొంది. పెద్దపల్లి మార్కెట్‌కు కొనుగోలుదారులు ఎవరు రాకపోవడంతో పత్తికొనుగోళ్లు జరగలేదు. మంగళవారం నుంచి పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని, రైతులు పత్తిని నిర్ణీత సమయంలోగా మార్కెట్‌కు తీసుకురావాలని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు