ఆదివారం, డిసెంబర్ 08, 2019
పెద్దపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: పెద్దపల్లిలోని జిల్లా పాలనా ప్రాంగణ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పాలనాధికారిణి శ్రీదేవసేన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ బాధులు చెప్పుకొచ్చారు. ఒక్కోక్కరి సమస్య వింటూ పరిష్కరించేందుకు భరోస నింపారు. మండల, గ్రామస్థాయిలో అధికారులకు చెప్పిన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ప్రజలు ఆరోపించారు. ఏళ్ల తరబడి నాన్చేధోరణి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డీఆర్వో నర్సింహమూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పారదర్శకంగా పని చేయండి: జిల్లాలో అధికారులు తమ విధులు పారదర్శకంగా నిర్వహించాలని పాలనాధికారిణి శ్రీదేవసేన కోరారు. జిల్లా అధికారులతో మాట్లాడుతూ అధికారులు తమ బాధ్యతలు విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై అనిశా వారు దాడులు చేసి పట్టుకుంటున్నారని, ఉద్యోగులు అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. మహిళా సాధికారత కోసం విశేష సేవలందించిన కలెక్టర్ ఇటీవల హైదరాబాద్లో తెలంగాణ బెస్ట్ బ్రాండ్ అవార్డు స్వీకరించిన సందర్భంగా జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు