బుధవారం, డిసెంబర్ 11, 2019
అంబర్‌పేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. సోమవారం అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమితి రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాస్‌యాదవ్, నగర ఉపాధ్యక్షుడు అశోక్‌యాదవ్, కార్యదర్శులు శ్రీశైలంయాదవ్, మూర్తి యాదవ్ తదితరులు మాట్లాడారు. ప్రత్యేక కార్పొరేషన్ విషయమై ఈ నెల 19న సికింద్రాబాద్ వెస్ట్‌మారేడుపల్లిలో రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాదవుల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి పాలకమండలిని నియమించాలని పేర్కొన్నారు. లేదంటే జిల్లాల వారిగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు