మంగళవారం, డిసెంబర్ 10, 2019
ఉప్పల్, న్యూస్‌టుడే: మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో తెదేపాకు పూర్వ వైభవం తెస్తామని పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు కందికంటి అశోక్‌కుమార్‌గౌడ్ అన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల్లో తెదేపా సత్తాచాటాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సోమవారం ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశానికి పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమావత్ లక్ష్మణ్‌నాయక్, నియోజకవర్గం అధ్యక్షుడు కందికంటి అశోక్‌కుమార్‌గౌడ్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను అప్పులకుప్పగా మార్చారన్నారు. తెరాస ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ పూర్తిస్థాయి కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా టీజీకే మూర్తి, కొలన్ నర్సింహారెడ్డి, జిల్లా శంకర్‌గుప్త, ఉప్పు రాము, ఖాజామోహినుద్ధీన్, ప్రధాన కార్యదర్శులుగా పద్మాచౌదరి, మధుకర్, ఎస్వీ కృష్ణప్రసాద్, వి.యాదగిరి, అధికార ప్రతినిధులుగా చిలుకూరి హరిచంద్, సి.సంతోష్సాగర్, వై.వెంకట్‌గాంధీ, ఎం.సాయితులసి, గోవర్ధన్‌నాయక్, వెంకటేశ్, మాచర్ల ప్రతిభ, కోశాధికారిగా సీహెచ్ వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ప్రవీణ్‌గౌడ్, ఎండీ మహమూద్, అబ్బూరి సాయి, రాములుయాదవ్, గౌరీశంకర్యాదవ్, సంజీవగౌడ్, బత్తిని నరసింహగౌడ్, కార్యదర్శులుగా ఎస్కే బాబు, కొమ్ము రాజయ్య, అనురాధ, కూన మురళీగౌడ్, వనసూరి సన్ని, ఎండీ యాసీన్, డి.యాదగిరి, మేడ్చల్ బాధ్యుడిగా కుతాడి రవీందర్‌ను నియమించారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు