శనివారం, డిసెంబర్ 07, 2019
మలక్‌పేట: మిస్టర్ హైదరాబాద్ ఓపెన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్-2019లో మొఘల్‌పురకు చెందిన మీర్ హసన్అలీ విజేతగా నిలిచారు. భాగ్యనగర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సహకారంతో మూసారంబాగ్ యూత్ బ్రిగేడ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రిపోటీలు నిర్వహించారు. విజేతకు రూ.20వేల నగదు, మెమోంటో, ధ్రువీకరణపత్రం అందజేశారు. బాడీ బిల్డింగ్ ఆరు విభాగాలుగా విభజించారు. 55కేజీల్లోపు, 65, 75, 85 కేజీలతో పాటు 90కేజీలపైన పోటీలు నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీవైఎం అధ్యక్షుడు వినయ్, నగర కార్యదర్శులు టి.రమేశ్‌రెడ్డి, దేవేందర్, బొక్క మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నగర ప్రధానకార్యదర్శి పొలం రవీందర్‌యాదవ్, డివిజన్ తెదేపా అధ్యక్షుడు బొక్క గోవర్ధన్‌రెడ్డి విజేతలకు బహుమతులు అందజేసి సన్మానించారు. న్యాయనిర్ణేతలుగా కె.సంజీవ. దేవేందర్‌యాదవ్, భాగ్యనగర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.సంపత్‌రెడ్డి, బి.రవికుమార్, రవీంద్రరెడ్డి వ్యవహరించారు. నిర్వాహకులు శివప్రసాద్, శివ, సల్మాన్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు