close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

విద్యాలయాల్లో కౌన్సెలర్లను నియమించాలని వినతి

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో మానసికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, మోడల్‌ స్కూళ్లలో కౌన్సెలర్లను నియమించాలని తెలంగాణ మనస్తత్వవేత్తల సంఘం కోరింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సంఘం అధ్యక్షుడు ఎం.రాంచందర్‌, కార్యదర్శి రాజులతో కూడిన బృందం ఆదివారం కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేసింది. విద్యార్థుల మనోభావాలను అర్థం చేసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సెలర్లు దోహదపడతారని వారు వివరించారు. వారితో పాటు సంఘం ప్రతినిధులు డాక్టర్‌ మనోహరన్‌, ఎ.సుధాకర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.