close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

ఠాణాల్లో తొంబై రోజుల ప్రణాళిక

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై దృష్టి
వివరాల కంప్యూటరీకరణ.. దస్త్రాల నిర్వహణ
బందోబస్తు విధులతో లక్ష్యం సాధ్యమేనా?
రవీంద్రభార[తి, న్యూస్‌టుడే

గరంలోని ఏ పోలీసు ఠాణాకు వెళ్లినా.. పోలీసులు పాత ఫైళ్ల దుమ్ము దులుపుతూ, అసంపూర్తిగా పనులను పూర్తి చేస్తూ పోలీసులు బిజీగా కనిపిస్తున్నారు.
ఎందుకంటారా.. ఇదంతా ‘తొంభై రోజుల ప్రణాళిక’లో భాగం. నిర్దేశించిన గడువులోగా నగరంలోని పోలీసు ఠాణాల్లో పెండింగులో ఉన్న కేసులను సాధ్యమైనంత వరకు పరిష్కరించడం, కేసులను తగ్గించుకోవడం, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు తగ్గించుకోవడం, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి.. కేసు ఆలస్యమవడానికి కారణాలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం, ఛార్జిషీట్లను దాఖలు చేయడం, బాధితులకు న్యాయం చేయడం, దోషులకు తగిన శిక్ష పడేలా చేయడం. ఇదీ స్థూలంగా ఈ 90 రోజుల ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.

పనిచేయని సీసీ కెమెరాలపై దృష్టి
ఇటీవల ఇటు దొంగతనాలు, అటు హత్యలు, అపహరణలు ఇతరత్రా నేరాలను పరిష్కరించడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆ కెమెరాల పనితీరును మెరుగుపర్చడం కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. స్థానిక పోలీసులు తమ పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్ని మొరాయిస్తున్నాయో వివరాలు సేకరిస్తున్నారు. పనిచేయనివాటిని నిపుణులతో పునరుద్ధరిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో కేసుల వివరాలు
ఠాణాలో నమోదైన ప్రతి కేసును సాధ్యమైనంత వరకు కంప్యూటరీకరణ చేయాల్సి ఉంది. ఎలాంటి ఫిర్యాదులైనా ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. తమ తమ ఠాణాల్లో చిన్న చిన్న గొడవలు జరిగినా ఈ-పెట్టి కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కోర్టులో ట్రయల్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలి.

దస్త్రాల నిర్వహణ పక్కాగా..
చాలా సందర్భాల్లో పాత కేసులను గురించి ఎవరైనా అడిగితే ‘ఏమో సార్‌! అది పాత కేసు కదా.. ఆ ఫైల్‌ ఇప్పుడెక్కడుందో తెలియదు. అసలు ఉందో లేదో కూడా తెలియదు’ అనే మాట వింటుంటాం. ఇప్పుడా సమస్యకు పరిష్కారంగా అన్ని పోలీసు ఠాణాలకు పెద్దసార్లు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు తగిన మార్గదర్శకాలు చేశారు. ఈ ఏడాదిలో నమోదైన కేసులెన్ని, నెలనెలా ఎన్ని నమోదయ్యాయి.. ఇలా వేర్వేరుగా మూటగట్టి ప్రత్యేక స్థానంలో వాటిని భద్రపర్చాలి. ఈ రోజు ఇక్కడున్న పోలీసు అధికారి భవిష్యత్తులో మరో ఠాణాకు బదిలీ కావచ్చు. కొత్త అధికారి వచ్చినప్పుడు ఫలానా కేసు తాలూకు దస్త్రం (ఫైల్‌) ఏమైందని అడిగితే.. ‘దొరకడం లేదు’ అనే మాట వినిపించకుండా ప్రత్యేకంగా భద్రపర్చుకోవాలన్నమాట. ఒక వేళ ఆ స్థానంలో ఉన్న దస్త్రాన్ని పని నిమిత్తం తీసుకున్నా.. పని ముగిశాక తిరిగి అదే చోట జాగ్రత్తగా పెట్టాలి. 90 రోజుల ప్రణాళికలో ఇలాంటి పలు ప్రత్యేక జాగ్రత్తలు సూచించారు.

భారం తగ్గించేందుకు..
తరచూ నేరాలకు పాల్పడుతున్నవారిపై పీడీ యాక్టు అమలు చేయాలి. కీలకమైన కొన్ని కేసులను అధికారులు దత్తత తీసుకొని.. దోషులను శిక్షించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ 90 రోజుల్లో పూర్తి చేయాలి. పోలీసు ఠాణాలు, కోర్టులపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికే ఈ ప్రణాళిక అమలు చేస్తున్నామంటున్నారు పోలీసు అధికారులు.

లక్ష్యం నెరవేరేనా
90 రోజుల ప్రణాళికను పూర్తి చేయాలంటే పోలీసులకు కొంత సమమం, తీరిక కూడా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు రోజూ ఏదో ఒక బందోబస్తులో బిజీగా ఉంటున్నారు. చాలా సందర్భాల్లో ఠాణాకు రాకుండా నేరుగా విధి నిర్వహణ ప్రదేశానికి వెళ్లి బందోబస్తులో పాల్గొనాల్సి వస్తోంది. రోజువారీ పని ఒత్తిడితో 90 రోజుల ప్రణాళిక లక్ష్యం ఏమేరకు నెరవేరుతుందన్నది వేచిచూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.