close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

రాష్ట్రస్థాయి పోటీలకు మంబాపూర్‌ విద్యార్థినులు


విద్యార్థులతో ఉపాధ్యాయులు

పెద్దేముల్‌, న్యూస్‌టుడే: మంబాపూర్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లా సరూర్‌నగర్‌లో జరిగిన అండర్‌ 14, అండర్‌ 17 విభాగంలో బాలికలు సత్తా చాటారు. వైశాలి జావలిన్‌ త్రోలో రెండవ స్థానం; రాధిక హమర్‌ త్రోలో రెండవ స్థానంలో నిలిచారు. ఉమామహేశ్వరి ట్రిపుల్‌ జంప్‌లో రెండవ స్థానం సాధించింది. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరు ఈ నెల 18న కరీంనగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు, వ్యాయామ ఉపాధ్యాయుడు రాజశేఖర్‌రెడ్డి విజేతలకు అభినందనలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.