శనివారం, డిసెంబర్ 07, 2019
త్రుటితో తప్పిన ప్రమాదం
రాంనగర్, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్లి డీఎం గదిని ఢీకొట్టిన ఘటన మంగళవారం ముషీరాబాద్ డిపో-1లో చోటుచేసుకుంది. ముషీరాబాద్ డిపో-1లో అవుట్సోర్సింగ్ అసిస్టెంట్ మెకానిక్‌గా పనిచేస్తున్న ప్రసాద్ మంగళవారం మధ్యాహ్నం డిపోలో ఓ బస్సును స్టార్ట్ చేసి హ్యాండ్‌బ్రేక్ వేయకుండా, మరో బస్సును పరిశీలించేందుకు వెళ్లారు. వాలు ప్రాంతంలో బస్సు ఉండడంతో వేగంగా వెళ్లి డిపో మేనేజర్ గదిని ఢీకొట్టింది. గదిలో బల్లపై కూర్చున్న ముషీరాబాద్ డిపో-2కు చెందిన అటెండర్ శ్రవణ్ కుడి కాలుపై ఇటుకలు పడటంతో గాయమైంది. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స చేసి ఇంటికి పంపించారు. ప్రమాద సమయంలో పెద్ద శబ్దం రావడంతో ఏమి జరిగిందో తెలియక కార్మికులు పరుగులు పెట్టారు. ఆ సమయంలో డీఎం గది వద్ద జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
జిల్లా వార్తలు