close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

ప్లాస్టిక్‌ సీసాల్లో పెట్రోల్‌ బంద్‌

సూచీ బోర్డులు పెడుతున్న బంకు నిర్వాహకులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ప్లాస్టిక్‌ సీసాల్లో పెట్రోల్‌ పోసేందుకు నగరంలోని బంకుల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించడంతో సీసాల్లో పెట్రోల్‌ పోయబోమంటూ సూచీ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల్లో తప్ప మరోవిధంగా ఇంధనం ఇచ్చేది లేదంటూ వినియోగదారులకు చెబుతున్నారు. ఈ నిబంధనలు ఇప్పటివి కాదు. పెసో(పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజీవ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌) నిబంధనల్లో దీని గురించి ప్రత్యేకంగా వివరించారు. అయినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన కొన్ని అనూహ్య ఘటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చర్యలకు ఉపక్రమించారు. నగరంలో సుమారు 500 వరకు పెట్రోల్‌ బంకులు ఉండగా నిత్యం 30 లక్షల లీటర్ల అమ్మకాలు జరగుతున్నాయి. ఇందులో సుమారు 1000 లీటర్ల వరకు ప్లాస్టిక్‌ సీసాల్లో తీసుకెళ్లేవారున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్‌ అవసరమైతే పరిస్థితి ఏంటంటూ వినియోగదారుల ప్రశ్నిస్తుంటే నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామని బంకు నిర్వాహకులు చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో, వినియోగదారుల అత్యవసరాన్ని బట్టి విక్రయిస్తున్నట్లు మరికొందరు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.