close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

ప్రధానాంశాలు

పదేళ్ల పండగ.. సాహిత్యం నిండుగా..

జనవరి 24 నుంచి ‘హైదరాబాద్‌ సాహితీ ఉత్సవం’
ఈనాడు, హైదరాబాద్‌

సాహితీ ప్రియులకు పండగ.. సాహిత్య ప్రక్రియలను ఇష్టపడేవారికి ఉత్సవం.. యువ రచయితలకు చర్చావేదిక.. కళాప్రియులకు కనులపంట.. దేశ, విదేశీ కవుల సందడి.. ఏటా జనవరిలో మూడు రోజుల పాటు జరిగే హైదరాబాద్‌ సాహితీ ఉత్సవం ఈసారి పదేళ్ల పండగను ఘనంగా జరుపుకోబోతుంది. 2020, జనవరి 24 నుంచి 26 వరకు జరిగే వేడుకకు రానున్న శుక్రవారం నుంచి సాహిత్య కార్యక్రమాలతో నాంది పలకనున్నారు.
* దేశంలోని వేర్వేరు నగరాల్లో సాహితీ ఉత్సవాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనూ సాహితీప్రియులు కొందరు కలిసి 2010లో మొట్టమొదటి హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ను నిర్వహించారు. హోటల్‌ గ్రీన్‌పార్క్‌లో ప్రారంభ వేడుక నిర్వహించగా.. ఓయూలోని మిగతా కార్యక్రమాలను నిర్వహించారు. ఓయూ సిప్‌ తొలి ఏడాది భాగస్వామిగా ఈ వేడుకకు పురుడు పోసింది. డిసెంబరు 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా సుమారు 100 మంది రచయితలు హాజరయ్యారు. సిటీలో ఈతరహా కార్యక్రమం ఇదే మొదటిది కావడంతో మంచి ఆదరణ లభించింది. 2011 మినహా ఏటా జనవరిలో ఉత్సవం నిర్వహిస్తున్నారు. శాశ్వత వేదిక లేకపోవడంతో ఒక్కో ఏటా ఒక చోట నిర్వహిస్తూ వస్తున్నారు.

రచయితలతో నేరుగా..
పలు సాహితీ పక్రియలపై చర్చలు, చిత్ర, ప్రదర్శనలు, పుస్తకావిష్కరణలు, కాలిగ్రఫీ కార్యశాలలు, కథలు చెప్పడం, డాక్యుమెంటరీల ప్రదర్శనలు, చిత్రకళా ఇలా భిన్న సృజనాత్మక రూపాల్లో ఉత్సవం సాగుతుంది. రచయితల అనుభవాలు వింటూ.. వారి పుస్తకాలు కొనుగోలు చేసి మరుపురాని జ్ఞాపకంగా వారితో ఆటోగ్రాఫ్‌ తీసుకునే అరుదైన అవకాశం ఉంటుంది.

విదేశీ.. స్వదేశీ...
ఈ ఉత్సవాల్లో ఏటా ఒక విదేశీ భాషను అతిథిగా, ఒక స్వదేశీ భాషను ప్రాధాన్యమైందిగా ప్రకటించి ఆ మేరకు ప్రత్యేక దృష్టిసారించేలా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆయా భాషల్లో రచనలు, కవులు, సాహిత్య పక్రియలపై చర్చలతో పాటు ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహిస్తుంటారు.

యువతరానికి స్ఫూర్తి..
నగరంలో పాతతరం వారిని గమనిస్తే చాలా భాషలపై పట్టు ఉండేది. ఉర్దూ, హిందీ, ఆంగ్లం, తెలుగు ఏదైనా అనర్గళంగా మాట్లాడేవారు. కొంతకాలంగా లింగ్విస్టిక్‌ హెరిటేజ్‌ పోయిందని భాషాప్రియులు వాపోతున్నారు. ఈ తరంలో ఆ స్ఫూర్తిని నింపేందుకు సాహితీ ఉత్సవాలు దోహదం చేస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రాధాన్యం తెలుసుకోలేకపోతే..
జీవన విధానంలో మన భాషల ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోతోంది. ఇటువంటి పరిసితుల్లో సాహిత్య ప్రాధాన్యాన్ని గుర్తు చేసేందుకు ఈ తరహా వేడుకలు ఉపయోగపడతాయి. విదేశాల నుంచి రచయితలు వస్తుంటారు. ఇక్కడి సంస్కృతిని, రచనల గురించి వారి వారి దేశాలకు వెళ్లాక చెబుతుంటారు. ఆ రకంగా మన నగరం అంతర్జాతీయంగా ఎదిగేందుకు.. మన రచనలు విశ్వవ్యాప్తం కానున్నాయి.

ఇక ప్రతి శుక్రవారం..
2020లో జరిగే పదో హైదరాబాద్‌ సాహితీ ఉత్సవం(హెచ్‌ఎల్‌ఎఫ్‌) చాలా ప్రత్యేకంగా నిలవనుంది. మరింత ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించేందుకు మూడు రోజుల ఉత్సవంలో మరిన్ని అనేక కార్యక్రమాలను తీసుకురాబోతున్నారు. ఇకపై ప్రతి శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు వేర్వేరు వేదికలపై హెచ్‌ఎల్‌ఎఫ్‌ కార్యక్రమం నగరంలో సందడి చేయనుంది. పదేళ్ల సందర్భంగా ముందస్తుగా పది కార్యక్రమాలను చేపట్టనున్నారు.

నవంబరు 22న
హైటెక్‌సిటీలోని ఫినిక్స్‌ ఎరీనాలో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ జాజ్‌  ఫెస్టివల్‌

నవంబరు 29
సికింద్రాబాద్‌లోని అవర్‌ సెక్రెడ్‌ స్పేస్‌లో భూమిక థియేటర్‌ గ్రూప్‌  ఆధ్వర్యంలో కథలు చెప్పడం

డిసెంబరు 6
ఫిల్మ్‌నగర్‌లోని అరోమలి సాంస్కృతిక కేంద్రంలో కవితా పఠనం

డిసెంబరు 13
గచ్చిబౌలి టీబీఏలో మలయాళ సినిమా  ప్రదర్శనలు

డిసెంబరు 20
సచివాలయం ఎదురుగా విద్యారణ్య హైస్కూల్‌లో మంథన్‌ కార్యక్రమం

డిసెంబరు 27
బంజారాహిల్స్‌ లామకాన్‌లో ‘మెఫిల్‌ హైదరాబాద్‌ కీ’

జనవరి 3
బంజారాహిల్స్‌ సప్తపర్ణిలో చిందు యక్షగానం

జనవరి 10
గచ్చిబౌలిలో టీబీఏలో కృష్ణకృతి ఉత్సవం

జనవరి 17
టీబీఏలో వయోలిన్‌ ప్రదర్శన

జనవరి 24
విద్యారణ్య హైస్కూల్‌లో కూడియట్టం

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.