శనివారం, డిసెంబర్ 07, 2019
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్ (సీబీసీఎస్) పరీక్షలు జనవరి 4 నుంచి 10 వరకు నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయవర్గాలు పేర్కొన్నాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబరు 14 చివరి తేదీ. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాయి. విద్యార్థులు www.braouonline.in పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి. పరీక్ష రుసుంను టీఎస్/ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా డెబిట్/ క్రెడిట్ కార్డులతోనే చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు విద్యార్థులు సంబంధిత అధ్యయన కేంద్రాల్లో లేదా 04023680241/254 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని విశ్వవిద్యాలయ వర్గాలు సూచించాయి.
తాజా వార్తలు
జిల్లా వార్తలు