బుధవారం, డిసెంబర్ 11, 2019
కంటోన్మెంట్, న్యూస్టుడే: ఆర్టీసీ కార్మికుల సమ్మె బుధవారం 47వ రోజుకు చేరింది. ఆర్టీసీని కాపాడాలని ఐకాస నేతలు, కార్మికులు కంటోన్మెంట్ డిపో వద్ద ఫ్ల్లకార్డులను ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. సుచిత్ర రామ్రాజ్నగర్కు చెందిన హుడా విశ్రాంత ఏఈ రమేశ్చంద్ర కార్మికులకు బియ్యం, పప్పు దినుసులు, నూనె, కారం, ఉప్పు తదితర సరకులను అందజేశారు. ఆర్టీసీ ఐకాస నేతలు, కార్మికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నేతలు మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రజలు తమవిగా భావించి కార్మికులను ఆదుకునేందుకు ముందుకొస్తుండడం అభినందనీయమన్నారు. ఎర్ర శ్రీను, లాలయ్య, లక్ష్మయ్య, లక్ష్మి, సావిత్రి పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు