close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

నిరుపేదల మెరుగైన వైద్యానికి సీఎం ప్రణాళిక

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు, ప్రాణాంతమైన వ్యాధుల బారినపడినప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులతో ఆసుపత్రుల్లో చూపించుకోలేని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. అఖిల భారత సగర మహాసభ, తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో సగర (ఉప్పర) ఉత్తమ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం రవీంద్రభారతి ప్రధాన మందిరంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ముత్యాల హరికిషన్‌ సగర అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. ఆరోగ్యశ్రీలో కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి శెన్‌చెట్టి విజయేంద్ర సగర, అఖిల భారత సగర మహాసభ ప్రధాన కార్యదర్శి రాచకొండ హనుమంత్‌ సగర, బీసీ ఐకాస ఛైర్మన్‌ నీరడి భూపేష్‌ సగర, నేతలు పురుషోత్తం సగర, సంఘం కోశాధికారి నరేందర్‌ సగర మాట్లాడుతూ.. సగర ఉప్పరులను బీసీ(డీ) నుంచి బీసీ(ఏ)లోకి చేర్చాలన్నారు. ట్యాంక్‌బండ్‌పై భగీరథ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, సగర ఉప్పరులను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించాలని, సగర ఫెడరేషన్లు ఏర్పాటు చేసి రూ.250 కోట్ల నిధులు కేటాయించాలని, పాలకమండలి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సంఖ్యా శాస్త్రవేత్త దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.