ఆదివారం, డిసెంబర్ 08, 2019
రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: సమాజంలో న్యాయవాద వృత్తి అత్యంత గౌరవప్రదమని, ఇది చేపట్టేవారు ఆ గౌరవం మరింత పెంపొందేలా నడుచుకోవాలని హైకోర్టు నూతన న్యాయమూర్తి జస్టిస్ అనిరెడ్డి అభిషేక్‌రెడ్డి అన్నారు. ఇటీవలే నియమితులైన ఆయనతో పాటు జస్టిస్ ఎ.లక్ష్మణ్, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ ఛైర్మన్ శ్రీరంగారావు, పంచాయతీరాజ్ ట్రైబ్యునల్ సభ్యుడు పి.గోవర్ధన్‌రెడ్డిని బుధవారం రంగారెడ్డిజిల్లా కోర్టులో స్థానిక న్యాయవాదుల సంఘం సన్మానించింది. అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బాచిరెడ్డి శాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో జస్టిస్ అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ, కాలానుగుణంగా వస్తున్న నూతన చట్టాలను న్యాయవాదులు ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలన్నారు. కష్టంచే తత్వం, అంకితభావం కలిగి ఉంటే న్యాయవాద వృత్తిలో అనతికాలంలో రాణిస్తారని తెలిపారు. జస్టిస్ లక్ష్మణ్ ప్రసంగిస్తూ. న్యాయార్థులైన కక్షి¨దారులకు సకాలంలో న్యాయం అందించడానికి కృషి చేసేవారే నిజమైన న్యాయవాది అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘంలో అత్యంత సీనియర్ సభ్యుడు పుల్లారెడ్డి, జిల్లా న్యాయమూర్తులు రేణుక, నర్సింగ్‌రావు, సంఘం ప్రతినిధులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి, ప్రభుత్వ న్యాయవాది రాజేశ్వర్‌రావు, సంఘం మాజీ అధ్యక్షులు సత్యవీరారెడ్డి, రఘునందన్‌రెడ్డి, శ్రీనాధ్, గంగాపురం చంద్రశేఖర్‌రెడ్డి, న్యాయవాద మండలి సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు