బుధవారం, డిసెంబర్ 11, 2019
ఏఎస్‌రావునగర్, న్యూస్‌టుడే
నగరంలో ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా కొన్ని రోజులకు అది డంప్యార్డవుతోంది. ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించారు కాప్రా డివిజన్ పరిధిలోని సాయిబాబా అధికారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు. అందరి సహకారంతో ఆ డంప్యార్డులనే మినీ ఉద్యానాలు, క్రీడా మైదానాలు, కూరగాయల తోటలుగా మలుచుకున్నారు.
ఐక్యతే వివిధ ప్రాంతాల అభివృద్ధికి కారణమని గుర్తించారు ఈ కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు. అలా అందరి సహకారంతో సైనిక్‌పురిలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ఆ స్థల యజమానితో మాట్లాడి దాన్ని ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతున్నారు.
అప్పటి చెత్తకుప్పలే.. ఇప్పుడు నందనవనాలు..
గతంలో చెత్తకుప్పలుగా ఉన్న 30 బహిరంగ ఖాళీ స్థలాల రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు. విస్తీర్ణం తక్కువుంటే స్థానికుల వాహనాలు నిలుపుకొనే ఏర్పాటు చేశారు. 400గజాల స్థలాన్ని పిల్లల ఆట మైదానంగా తీర్చిదిద్దారు. మరోచోట ఉద్యాన విభాగం సహకారంతో సేంద్రియంగా కూరగాయల సాగు చేట్టారు. తీర్చిదిద్దిన ఉద్యానాల్లో వ్యాహ్యాళికి, విశ్రాంతికి ఏర్పాట్లు చేశారు.
మార్పు కోసం కలిసొచ్చారు
- సీఎస్ చంద్రశేఖర్, సికింద్రాబాద్ నార్త్ఈస్టర్న్ కాలనీల సంఘం కార్యదర్శి
అందరి సాయంతో కాలనీల రూపురేఖలు మార్చుకున్నాం. ఇప్పుడు దోమలు తగ్గాయి. మరిన్ని ప్రాంతాల్లో ఈ ప్రయత్నం మొదలవ్వాలి.
తాజా వార్తలు
జిల్లా వార్తలు