సోమవారం, డిసెంబర్ 09, 2019
గుంటూరు రైల్వే, నంద్యాల, న్యూస్‌టుడే: గుంటూరు రైల్వే డివిజన్ నూతన మండల రైల్వే అధికారి(డీఆర్ఎం)గా ఆర్.మోహన్‌రాజా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఐఆర్పీఎస్ 1990 బ్యాచ్‌కు చెందిన మోహన్‌రాజా చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ రైల్వేలో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ముఖ్య చీఫ్ పర్సనల్ అధికారిగా పని చేస్తూ బదిలీపై గుంటూరు డివిజన్‌కు డీఆర్ఎంగా వచ్చారు.
అధికారులతో సమావేశం
డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. ద.మ.రైల్వే జనరల్ మేనేజరు శుక్రవారం నంధ్యాల నుంచి రేపల్లె వరకు పర్యటించనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే జీఎం పర్యటనపై చేసిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం అధికారులతో కలిసి నంధ్యాల బయలుదేరి వెళ్లారు.
నూతన డీఆర్ఎంకు ఘన స్వాగతం
చెన్నై నుంచి గుంటూరు వచ్చిన నూతన డీఆర్ఎం మోహన్‌రాజాకు స్టేషన్లోనే ద.మ.రైల్వే ఎంప్లాయీస్ సంఘం నాయకులు రామమోహనరావు నేతృత్వంలో ఘనంగా స్వాగతం పలికారు. రైల్ వికాస్ భవన్లో ద.మ. రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు హనుమంతరావు ఆధ్వర్యంలో పలువురు డీఆర్ఎంకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఏడీఆర్‌ఎంలు రంగనాథ్, శ్రీనివాస్‌తో పాటు పలువురు అధికారులు డీఆర్ఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు