close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

మంచి నేస్తాలు.. విజ్ఞాన ప్రదాయినులు
పుస్తక ప్రదర్శనకు తరగని ఆదరణ

న్యూస్‌టుడే, వికారాబాద్‌

ప్రదర్శనలో ఉంచిన పిల్లల పుస్తకాలు

చిరిగిన చొక్కా అయినా వేసుకో.. ఓ మంచి పుస్తకం కొనుక్కో... అన్నారు మహాకవి కందుకూరి వీరేశలింగం. పుస్తకాలు మంచి నేస్తాలు. విజ్ఞాన ప్రదాయినులు. వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకాలు. వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఎన్నెన్నో. ఇటీవల జరిగిన గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా వికారాబాద్‌లోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో నవతెలంగాణ ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన పుస్తక ప్రియులను ఎంతో ఆకర్షించింది. ఎంతో మంది తమ అభిరుచికి తగ్గపుస్తకాలు కొనుగోలు చేశారు. ఈనెల 14 నుంచి 20 వరకు కొనసాగిన ఈ ప్రదర్శనలో విజ్ఞానాన్ని పెంపొందించేవి, పోటీ పరీక్షలకు, ఆధ్యాత్మిక, సాంకేతిక, మానసిక ఉత్సాహం, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసి ప్రేరణ కలిగించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా పుస్తకప్రియులు తమ అభిప్రాయాలను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.

పోటీ పరీక్షలకు అవసరమయ్యే వివిధ రకాల పుస్తకాలు ప్రదర్శనలో ఉంచడం ఆనందంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2, డీఎస్సీ, బ్యాంకు, రైల్వే తదితర పోటీ పరీక్షలు రాయడానికి కరెంట్‌ ఎఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌, క్రీడలు, చరిత్ర, ఆర్థిక, రాజకీయ, విజ్ఞాన, భూగోళశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలతో పాటు తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ నిఘంటువులు ఒకే చోట అందుబాటులో రావడం ఉపయోగకరంగా మారిందని పేర్కొన్నారు. తరచూ ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

చిన్నారుల కోసం..

చిన్నారులకు సంబంధించి ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉంచగా కొనుగోళ్లు బాగున్నాయని నవతెలంగాణ ప్రచురణ సంస్థ ప్రతినిధి ప్రవీణ్‌ తెలిపారు. అన్ని రకాల పుస్తకాలను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ఏటా వికారాబాద్‌లో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

పుస్తక ప్రదర్శన నచ్చింది.. - వసంత్‌రావు, నిరుద్యోగ అభ్యర్థి, పులుసుమామిడి, వికారాబాద్‌

నేను వికారాబాద్‌ మండలంలోని పులుసు మామిడి గ్రామస్థుడిని. ఆరేళ్లుగా క్రమం తప్పకుండా గ్రంథాలయానికి వచ్చి పోటీ పరీక్షల పుస్తకాలు చదువుతున్నాను. ప్రతి పోటీ పరీక్షకు గ్రంథాలయంపైనే ఆధారపడేవాడిని. ఈసారి వచేతన పుస్తక ప్రదర్శనకు వచ్చాను. ఇక్కడ అందుబాటులో ఉంచిన పుస్తకాలు పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి ఎంతగానో ఉపయోగపడేలా ఉన్నాయి.

నెలకోసారి ఏర్పాటు చేయాలి.. - రాజేశ్వరప్రసాద్‌, ప్రభుత్వ ఉద్యోగి, వికారాబాద్‌

నాకు గ్రంథాలయంలో 15 ఏళ్లుగా సభ్యత్వం ఉంది. సెలవు రోజుల్లో కచ్చితంగా గ్రంథాలయానికి వెళ్తాను. ఏటా పుస్తక ప్రదర్శనలో నచ్చిన రచయితల నవలలు కొనుగోలు చేస్తాను. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కాకుండా నెలకోసారి జిల్లా కేంద్రంలో ప్రదర్శన ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

అందరికీ ప్రయోజనకరమే.. - మహేష్‌, డిగ్రీ విద్యార్థి, వికారాబాద్‌

పుస్తక ప్రదర్శనలో అందరికీ ప్రయోజనం కలిగించే పుస్తకాలు ఉన్నాయి. అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమవడానికి ఉపయోగపడే పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ప్రదర్శనలో కొనుగోలు చేసే విద్యార్థులకు కనీసం 30 శాతం రాయితీ ఇస్తే మరిన్ని పుస్తకాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల పుస్తకాలు కొనుగోలు చేశా.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.