close

గురువారం, డిసెంబర్ 12, 2019

ప్రధానాంశాలు

2021 జన గణనకు సమాయత్తం

జిల్లా, మండల స్థాయిలో సిబ్బందిని నియమించాలి

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : అధికారులు జిల్లాలో జన గణన-2021కు సమాయత్తం కావాలని జనాభా గణన రాష్ట్ర డైరెక్టర్‌ ఇలంబర్తి సూచించారు. గురువారం ఆయన హైదరాబాదు నుంచి జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి దశరథ్‌, మహబూబ్‌నగర్‌ పుర కమిషనర్‌ సురేందర్‌ తదితరులతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపట్టిన సన్నాహక జన గణనలో పాలమూరులో అధికారులు చాలా చక్కగా పనిచేశారని కితాబు ఇచ్చారు. వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలో హౌస్‌హోల్డ్‌ షెడ్యూల్‌ ప్రీటెస్ట్‌’గా సన్నాహక జన గణన చేపట్టామని అందులో భాగంగానే నవాబుపేట మండలంలోని పోమాల్‌, కొల్లూరు, దేపల్లి, కాకర్‌జాలలో గుర్తించిన బ్లాకుల వారీగా జన గణనను వందశాతం విజయవంతం చేశారన్నారు. ఇదే తరహాలో 2021 జనాభా లెక్కల సేకరణకు సిద్ధం కావాలని, దీనికి గాను వచ్చే నెల 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ హైదరబాదులో నిర్వహించే శిక్షణకు మాస్టర్‌ ట్రైనర్లను జిల్లా నుంచి పంపించాలని అన్నారు. ముఖ్యంగా జిల్లా, మండల స్థాయిలో జనాభా గణనకు సిబ్బందిని సిద్ధం చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 15 మండలాలు, మూడు పురపాలికలు ఉన్నాయని నివేదించారు. గ్రామాలు, పట్టణాల వారీగా జనాభా గణనకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి రాష్ట్ర అధికారులకు నివేదించామని చెప్పారు. కలెక్టర్‌, జేసీ, డీఆర్వోతోపాటు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, పురపాలక కమిషనర్లు, తహశీల్దార్లు, ఉప తహశీల్దార్లు, డీఈఈ, ఏఈఈ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, ఆర్‌ఐలు, పురపాలిక పరిధిలో వార్డుల వారీగా అధికారులకు బాధ్యతలు కేటాయిస్తూ.. సమాచారం చేరవేశామని విన్నవించారు. వీసీలో సీపీవో కార్యాలయ అధికారులు, పురపాలక, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.