close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

డయల్‌ 100 ఫోన్లకు వేగంగా స్పందించాలి

అదనపు ఎస్పీ షాకీర్‌హుసేన్‌

మాట్లాడుతున్న అదనపు  ఎస్పీ షాకీర్‌హుసేన్‌

వనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే : ప్రజలు అత్యవసర సమయాల్లో వినియోగించే డయల్‌ 100కు వచ్చిన ఫోన్లకు పోలీసులు స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సేవలందించాలని అదనపు  ఎస్పీ షాకీర్‌హుసేన్‌ అన్నారు. వనపర్తి  ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని ఆయా ఠాణాల్లో పనిచేస్తున్న బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ సిబ్బందికి వర్టీకల్‌ అంశంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. డయల్‌ 100కు ఫోన్‌ వచ్చిన వెంటనే సంఘటనకు స్పందించి, ముగిసిన సమయం ఎప్పటికప్పుడూ ఆన్‌లైన్‌ నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన అనంతరం సమస్య గురించి అధికారులకు సమాచారమివ్వాలన్నారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల ఫింగర్‌ ఫ్రింట్‌ (వేలిముద్ర)ను స్కాన్‌, మొబైల్‌ సెక్యూరిటీ చెక్‌డివైస్‌, ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ పద్ధతి ద్వారా క్షుణ్నంగా తనిఖీ చేసి వారి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ విధులు నిర్వర్తించడంలో బ్లూకోల్ట్స్‌ పాత్ర ముఖ్యమన్నారు. వర్టికల్‌ అంశంపై ఆత్మకూరు పోలీసు వలయాధికారి సీీతయ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీీఆర్బీ సీీఐ జమ్ములప్ప, ఐటీసెల్‌ ఇన్‌ఛార్జి గోవింద్‌, సిబ్బంది మురళి, విజయ్‌, మన్యం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.