close

గురువారం, డిసెంబర్ 12, 2019

ప్రధానాంశాలు

సరికొత్త ఆలోచన.. పెరిగిన ఆదరణ

ఐపీపీబీ ద్వారా ఉత్తమ సేవలు

పెరుగుతున్న ఖాతాదారులు

ప్రారంభమైన ఆధార్‌ ఆధారిత పేమెంట్స్‌

ఖలీల్‌వాడి (నిజామాబాద్‌), న్యూస్‌టుడే

క్యూఆర్‌ కార్డులు అందుకున్న ఖాతాదారులు

తపాలా బ్యాంకుల్లో అన్ని రకాల సేవలు ఉన్నప్పటికీ ప్రజల్లో ఆదరణ తగ్గింది. సిబ్బంది సరిగా స్పందించరని, లావాదేవీలు ఆలస్యమవుతాయని, ఆన్‌లైన్‌ సేవలు లేవని వంటి కారణాలతో ఆసక్తి చూపేవారు కాదు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అనుగుణంగా అనేక మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా ప్రవేశపెట్టిన ఐపీపీబీ(ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు)కి ఆదరణ పెరుగుతోంది. గ్రామీణ స్ధాయిలోనూ సేవలందిస్తుండటంతో ఖాతాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఖాతాదారులకు ఉత్తమ సేవలందిస్తున్నారు. తపాలాశాఖకు పూర్వ వైభవం సంతరించుకుంటోంది.

తపాలా బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతా రూ.100, కరెంట్‌ ఖాతా రూ.1000 చెల్లించి ప్రారంభించవచ్ఛు కేవలం ఆధార్‌ నంబరు, వేలిముద్ర ఆధారంగా నిమిషాల్లో తెరవచ్ఛుఅప్పటికప్పుడే క్యూఆర్‌ కార్డు అందజేస్తారు. సేవింగ్‌ ఖాతాపై 4 శాతం వడ్డీ అందిస్తున్నారు. పూర్తిగా కాగితరహిత కార్యకలాపాలు నిర్వహించేలా ఆలోచన చేశారు.

ఇంటి వద్దే పొందవచ్చు

తపాలా బ్యాంకు అందిస్తున్న అన్ని రకాల సేవలు పోస్టుమ్యాన్‌ ద్వారా ఇంటి వద్దే పొందవచ్ఛు ఇందు కోసం ఖాతాదారులు ఒక రోజు ముందు 155299 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేస్తే సరిపోతుంది. చరవాణితో పాటు బయోమెట్రిక్‌ అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇంటి వద్దకే వచ్చి డబ్బులు ఇస్తారు.

యాప్‌ తప్పనిసరి

తపాలా బ్యాంకు సేవలు ఆన్‌లైన్‌ ద్వారా పొందటానికి ఐపీపీబీ యాప్‌ తప్పనిసరి. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేయాలి. తర్వాత అన్ని రకాల సేవలు ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్ఛు

ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్స్‌

తపాలా బ్యాంకు మొదటి వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబరు 1 నుంచి ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ప్రవేశపెట్టారు. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానమైన ఖాతాదారుడు తపాలా కార్యాలయానికి వెళ్లి చరవాణి, ఆధార్‌ సంఖ్య తెలిపితే వేలిముద్ర తీసుకొని రూ.10 వేల వరకు విత్‌డ్రా చేసుకోవచ్ఛు ఇందుకు ఎలాంటి రుసుము వసూలు చేయరు. దేశంలోని ఏ కార్యాలయంలోనైనా తీసుకోవచ్ఛు.

జిల్లాలో తపాలా..

ప్రధాన కార్యాలయాలు నిజామాబాద్‌, ఆర్మూర్‌

ఐపీపీబీ సేవలు ప్రారంభం 2018 సెప్టెంబరు 1

సేవల విస్తరణ అన్ని గ్రామాల్లో

కొత్త తరహాలో సేవలు

*● తపాలా బ్యాంకు అందిస్తున్న సేవలు కొత్త తరహాలో ఉన్నాయి. ఖాతాదారులు ఇబ్బంది పడకుండా లావాదేవీలు పూర్తిగా ఆన్‌లైన్‌ చేశారు.

*● ఐపీపీబీ అన్ని రకాల సేవలు అందిస్తోంది. వ్యక్తిగత ఖాతా నుంచి నగదు తీయాలన్నా, వేయాలన్నా ఇంటి వద్ద నుంచే చేయొచ్ఛు

*● క్యూఆర్‌ కార్డుల ద్వారా నఫె్ట్‌, ఆర్‌టీజీఎస్‌, ఐఎంపీఎస్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, బిల్లుల చెల్లింపులు వంటివి పొందవచ్ఛు

* ఖాతాదారు రోజుకు రూ.లక్ష వరకు లావాదేవీలు నిర్వహించుకోవచ్ఛు

రానున్న మరికొన్ని సేవలు

* మర్చంట్‌ యాప్‌

* యూపీసీ సర్వీసులు(యునీక్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌)

* వర్చువల్‌ డెబిట్‌ కార్డ్‌ (ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ కోసం)

స్పందన బాగుంది

- శ్రావణ్‌కుమార్‌, ఐపీపీబీ సీనియర్‌ మేనేజర్‌, నిజామాబాద్‌

తపాలా బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. వీటిని ప్రారంభించిన నాటి నుంచి స్పందనపెరుగుతోంది. ఆన్‌లైన్‌లోనే అన్ని రకాల సేవలు అందిస్తుండటంతో ఆదరిస్తున్నారు.


కొత్తగా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు

తపాలా బ్యాంకుల పని తీరు బాగుండటంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు తీసుకురావడానికి ఆలోచన చేస్తోంది. వీటి ద్వారా డ్వాక్రా, ముద్ర, కుటీర పరిశ్రమలకు రుణాలు అందించడానికి వీలుంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నివేదికను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. కొద్ది రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.


బ్యాంకు ఖాతాలు

ప్రారంభంలో 7186      ఆరు నెలల్లో 38,950     ఏడాదిలో 65,600

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.