మంగళవారం, డిసెంబర్ 10, 2019
క్వారీలు తనిఖీ చేసిన గనులశాఖ ఏడీ
న్యూస్టుడే, కోటగిరి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు స్పందించారు. ‘అధికారికంగా దాచి.. అక్రమంగా దోచి’ శీర్షికన ‘ఈనాడు’లో వచ్చిన కథనానికి నిజామాబాద్ పాలనాధికారి ఎంఆర్ఎం రావు స్పందించారు. క్వారీలు తనిఖీ చేయాలని గనుల శాఖ అదనపు సంచాలకుడు సత్యనారాయణను ఆదేశించారు. నీలా, కందకుర్తి, హంగర్గ ప్రాంతాల్లో పరిశీలించారు. అక్కడున్న ఇసుక నిల్వలు గతంలో తవ్వినవే అంటూ నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఇసుక నిల్వలు ఉంటాయా?అవి తాజావా అనే విషయాన్ని కూడా అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. ఇసుక అక్రమంగా రాత్రివేళ తరలుతోంది... ఉదయం వేళ తనిఖీలకు వెళ్తే ఎలా వెలుగులోకి వస్తుందో అధికారులకే తెలియాలి.
తాజా వార్తలు
జిల్లా వార్తలు