శుక్రవారం, డిసెంబర్ 13, 2019
అంబర్‌పేట, న్యూస్‌టుడే: ఈ నెల 22 సాయంత్రం 5 గంటలకు అంబర్‌పేట మున్సిపల్ మైదానంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవం, వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విజ్ఞప్తి చేశారు. గురువారం అంబర్‌పేట మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చినజీయర్ స్వామి, అహోబిల జీయర్ స్వామి, దేవనాథ్ జీయర్ స్వామి, మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. పూజలకు అవసరమైన పూజా సామగ్రిని తామే అందజేస్తామన్నారు. తెరాస ఎన్నికల ఇన్‌ఛార్జి బండారు లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు పులి జగన్, కాలేరు పద్మ, పద్మావతి, గరిగంటి శ్రీదేవి, బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధి ఆచార్య ఆత్రేయ, నాయకులు కన్నా, రమేశ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు