సోమవారం, డిసెంబర్ 16, 2019
సైదాబాద్ పోలీసులకు ఆదేశం: న్యాయవాది
సైదాబాద్, న్యూస్టుడే: శాసనసభ్యుడు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించిందని న్యాయవాది కె.కరుణాసాగర్ తెలిపారు. తన ఫిర్యాదు మేరకు 14ఏసీఎంఎం కోర్టు- సెక్షన్ 153(ఏ), 153 (బీ), ఐపీసీ 506 కింద కేసు నమోదు చేయాలని సైదాబాద్ పోలీసులను ఆదేశించిందన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందున కేసు నమోదు చేసి డిసెంబరు 23న నివేదిక సమర్పించాలందని పేర్కొన్నారు. తమకు న్యాయస్థానం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలూ అందలేదని, ఉన్నతాధికారులను సంప్రదించి చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు