close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

వంచేద్దాం.. దూసుకెళ్దాం..

ట్రాఫిక్‌ జరిమానాలను తప్పించుకుంటున్న వాహనచోదకులు
ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా అంతంతే ఫలితాలు

ట్రాఫిక్‌ పోలీసులు రహదారులపై కనిపించకపోయినా కెమెరాలతో ఫొటోలు తీస్తున్నారని ద్విచక్రవాహనచోదకులు గమనించారు. దీంతోపాటు రహదారులపై వెళ్తున్న ద్విచక్రవాహనచోదకుల్లో 30 శాతం మంది ట్రాఫిక్‌ పోలీసులంటే జరిమానాల కోసమేనని ఇప్పటికీ అనుకుంటున్నారు. శిరస్త్రాణం ధరించడం, నిబంధనలు పాటించడం వంటివి చేస్తున్నారు. ఒకటి, రెండు సందర్భాల్లో వీరికి జరిమానాలు విధిస్తే... అప్పటి వరకూ నిబంధనలను పాటించిన వారు.. తర్వాత వెయ్యి రూపాయలు, రెండువేల రూపాయలు ఎందుకు చెల్లించాలి? అనుకుంటున్నారు. దీంతో అప్పటి నుంచి పోలీస్‌ కెమెరా కళ్లకు దొరికినా జరిమానా పడకుండా ద్విచక్రవాహనాల నంబర్‌ ప్లేట్లను వంచేస్తున్నారు. ఒకే బైక్‌పై తరచూ ముగ్గురు వెళ్లే విద్యార్థులు, యువకులు ట్రాఫిక్‌ జరిమానాలను తప్పించుకునేందుకు నంబర్‌ ప్లేట్లను వంచేస్తున్నారు. సికింద్రాబాద్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, మెహిదీపట్నం, అబిడ్స్‌ ప్రాంతాల్లో రాంగ్‌రూట్‌లో వెళ్లే వాహనచోదకులు, కొందరు వ్యాపారులు నంబర్‌ ప్లేట్లను వంచేసి దర్జాగా వెళ్తున్నారు. పార్కింగ్‌ లేని ప్రాంతాలు, దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌ వద్ద రోడ్డుపైనే వారి వాహనాలను ఉంచుతున్నారు.

ప్రత్యేక డ్రైవ్‌లు కొన్ని ప్రాంతాలకే ...
వందల మంది ద్విచక్రవాహనచోదకులు నంబర్‌ ప్లేట్లను వంచేసి వెళ్తున్నారంటూ నెటిజన్ల ద్వారా ట్రాఫిక్‌ పోలీసులకు వంద సంఖలో ఫిర్యాదులు వస్తున్నాయి. మా వాహనాల నంబర్‌ ప్లేట్లు సక్రమంగా ఉన్నాయ్‌... మేం ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తున్నాం...  నిమిషంపాటు రోడ్డుపై వాహనాన్ని నిలిపితే మాపై చలానాలు విధిస్తున్నారు... వీరు రోజూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా మీరెందుకు పట్టించుకోవడం లేదంటూ నెటిజన్లు ట్రాఫిక్‌ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నంబర్‌ ప్లేట్లను వంచేసిన వారి పొటోలను తీసి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటున్న ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహస్తున్నారు. నంబర్‌ ప్లేట్లను వంచేయడం, కనిపించకుండా చేయడం మోటార్‌ వాహన చట్టం ప్రకారం నేరం అంటూ పట్టుబడిన వారికి వివరిస్తున్నారు. రవాణాశాఖ సూచించిన విధ]ంగా నంబర్‌ ప్లేట్లు ఉండాలని చెబుతున్నారు. వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే నంబర్‌ ప్లేట్లు సక్రమంగా లేకుండా వెళ్తున్న వారిని పట్టుకునేందుకు ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌లు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌, అబిడ్స్‌, మలక్‌పేట, చిక్కడపల్లి, కాచిగూడ, బేగంపేట ప్రాంతాలకు పరిమితమవుతున్నాయి. రహదారులపై కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ విధులు నిర్వహించే పోలీసులు వీరిని చూసినా పట్టించుకోకపోవడంతో వాహనచోదకులు ఇష్టారాజ్యంగా వెళ్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.