close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

దత్త జయంతి.. ఆధ్యాత్మిక జగతి

ఈ నెల 9 నుంచి 13 వరకు జాతర ●

తరలిరానున్న భక్తజనం

న్యూస్‌టుడే, ఝరాసంగం

దత్తాత్రేయ ఆలయం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని బర్ధీపూర్‌ దత్తగిరి మహరాజ్‌ ఆశ్రమం దత్తజయంతి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 9 నుంచి 13 వరకు నిర్వహించే ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆశ్రమ ఆవరణలో పందిళ్లు, తాగునీరు, భోజన వసతి కల్పిస్తున్నారు. ఆలయ ముఖద్వారంతో పాటు దత్తాత్రేయ, ఆత్రేయమహర్షి, అనుసూయమాత, జ్యోతిర్లింగాల ఆలయం, పంచవృక్షాలు, రేణుకామాత, నవగ్రహల ఆలయాలకు రంగులు వేసి, విద్యుత్తు దీపాలతో అందంగా అలంకరిస్తున్నారు. బర్ధీపూర్‌-చీలపల్లి మార్గంలో ఆశ్రమం ముందున్న రోడ్డు మధ్యలో దీపాలు అమర్చారు. జహీరాబాద్‌ గ్రామీణ వలయాధికారి కృష్ణకిశోర్‌, ఝరాసంగం ఎస్సై ఏడుకొండలు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను జహీరాబాద్‌ పట్టణం నుంచి ఆశ్రమానికి భక్తులను చేరవేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఝరాసంగం వైధ్యాధికారి మాజీద్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చరిత్ర.. ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు దత్తగరి మహారాజ్‌ 1962లో ఆశ్రమ ఆవరణలో మేడి, మర్రి, రాగి, నిమ్మ, వేప నాటారు. అదే ఏడాది ధుని(అగ్నిగుండం) స్థాపన చేశారు. పంచవృక్షాల చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు. వృక్షాలకు కొబ్బరికాయలు ముడుపు కడుతుంటారు. 1974లో దత్తాత్రేయ విగ్రహం ప్రతిష్టించారు.

21 యజ్ఞ గుండాలతో.. దత్తజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్‌, అనుసూయమాత, ఉత్తరాధికారి డాక్టర్‌ సిద్దేశ్వరనందగిరిస్వామి, గణపతి దీక్షితులు, ఆశ్రమ కమిటీ అధ్యక్షుడు అల్లాడి వీరేశం, ఉత్సవ కమిటీ ప్రతినిధుల పర్యవేక్షణలో యజ్ఞం నిర్వహిస్తారు. ఈ నెల 9,10,11వ తేదీల్లో భక్తులతో 21 యజ్ఞ గుండాలతో హోమం నిర్వహించనున్నారు. 11న మధ్యాహ్నం దత్తాత్రేయ డోలారోహణ, దత్తదీక్షలు తీసుకున్న భక్తుల దీక్ష విరమణ, సాయంత్రం 21,600 దీపాలతో దీపారాధన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రి ఆధ్యాత్మిక సభ, కీర్తనలు, భజన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 12న పల్లకిసేవ ఊరేగింపు, 13న దత్తగిరి మహారాజ్‌ అమరతిథి పాదపూజ, సంగీత రుద్రాభిషేకం, పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం, కచేరి ఉంటాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.