close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

ఆన్‌లైన్‌లో ఏడడుగుల్లో..

ధర్మ పరిరక్షణకు తితిదే బృహత్కార్యం

విరాళాల స్వీకరణకు శ్రీవాణి ట్రస్టు

పేరిట ఆన్‌లైన్‌ కార్పస్‌ హుండీ

రూ.10వేలకు బ్రేక్‌దర్శనం..●

రూ.99,999 వరకు గరిష్ఠంగా 9 బ్రేక్‌ దర్శనాలు

త్వరలో వసతి గదులూ అందుబాటులోకి

న్యూస్‌టుడే, తిరుమల

శ్రీవాణీగిరిజశ్చిరాయ అనే పద్యంతో నన్నయ ఉత్కృష్ట్ర గ్రంథమైన మహాభారతానికి శ్రీకారం చుట్టినట్లే.. శ్రీవాణి (srivani:sri venkateshwara alayala nirmanam) పేరుతో హిందూ ధర్మపరిరక్షణకు తితిదే తెరదీసింది. ఈ బృహత్కార్యంలో స్వామివారి భక్తులను భాగస్వాములను చేస్తోంది. వివిధ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం, నిర్వహణ, పునరుద్ధరణ, ధార్మిక కార్యక్రమాలు, ఉత్సవ క్రతువులు జరిపించడం కోసం రూపాయి నుంచి రూ.కోటి వరకు భక్తుల నుంచి విరాళాలను స్వీకరించేందుకు శ్రీవాణి ట్రస్టు పేరిట ఆన్‌లైన్‌ కార్పస్‌ హుండీని తితిదే అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా తిరుమలేశుడిని దగ్గర నుంచి చూడాలన్న కలను సైతం తీర్చుకునేందుకు ఈ ట్రస్టు ద్వారా వీలు కల్పించనుంది. బ్రేక్‌ దర్శనం (కులశేఖరపడి గది నుంచి స్వామివారి సమీప దర్శనం) పొందాలంటే రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, ఉన్నతాధికారులకే అవకాశం ఉండేది. సామాన్యుడికి జయ, విజయల స్థానం నుంచి మహాలఘు దర్శనమే ఉంది. ఇప్పటివరకు బ్రేక్‌ దర్శనం సిఫార్సు లేఖల కోసం ప్రముఖుల చుట్టూ తిరిగేవారు. బ్రేక్‌ దర్శనం టిక్కెట్టు రూ.500కు తోడు దళారులకు ఇచ్చే కమీషనే రూ.వేలల్లో ఉండేది. ఈ అక్రమాలకు శ్రీవాణి ట్రస్టు చెక్‌ పెట్టింది. రూ.10,000 విరాళం ఆన్‌లైన్‌లో సమర్పిస్తే చాలు.. సిఫార్సులు, తిరగడాలు లేకుండానే ఏడాదిలో స్లాట్‌లు ఖాళీగా ఉన్న రోజుల్లో బ్రేక్‌ దర్శనం పొందొచ్ఛు హిందూ ధర్మరక్షణలో సాయపడిన వారూ కావొచ్ఛు ‘స్వామివారి సమీప దర్శనం కోసం మేం ఎంతైనా చెల్లించేందుకు సిద్ధమే, కానీ ఎవరిని సంప్రదించాలో.. ఏం కావాలో తెలియదంటూ దళారులను నమ్ముకొని మోసపోయి చివరకు మహాలఘు దర్శనం చేసుకునే వారెందరో! ఇలాంటి వారికి ఈ ట్రస్టు వరమనే చెప్పాలి. తొలుత ఆఫ్‌లైన్‌లో ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకు భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో మరింత విస్తృతపరుస్తూ.. ఆన్‌లైన్‌లోనూ (ttdsevaonline.comలో) అందుబాటులోకి తెచ్చింది దేవస్థానం.

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.