close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

మేడారం

సింగరేణి ఆర్జీ-3లో బొగ్గు ఉత్పత్తిపై జీఎం సమీక్ష

సెంటినరీకాలనీ, న్యూస్‌టుడే: సింగరేణి యాజమాన్యం ఆర్జీ-3కి నిర్ధేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై జీఎం సూర్యనారాయణ ఓసీపీ-1,2 అధికారులకు పలు సూచనలను చేశారు. గురువారం సాయంత్రం జీఎం కార్యాలయంలో ఓసీపీ-1,2, సీహెచ్‌పీతోపాటు ఆయా విభాగాల అధికారులతో సమావేశమైన జీఎం ఆర్జీ-3కి నిర్ధేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనపై సమీక్షించారు. ఆర్జీ-3కి నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం, ఇందులో నుంచి ఇప్పటి వరకు సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను ఓసీపీ-1,2 అధికారులు జీఎంకు వివరించారు. గడిచిన రెండు, మూడు నెలల వ్యవధిలో అధిక వర్షాలు కురవటం, ఓసీపీ-1,2ల్లో పలు సమస్యలు తలెత్తటం కారణంగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేకపోయిందన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నాలుగునెలల గడువు మాత్రమే ఉన్నందున వార్షిక లక్ష్య సాధనకు కార్మికులను సమాయాత్తం చేయాలని జీఎం అధికారులకు సూచించారు. ఓసీపీ-1,2ల్లోని యంత్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని నిర్థేశిత లక్ష్యాన్ని సాధించాలని జీఎం అధికారులకు సూచించారు. వార్షిక లక్ష్య సాధన కోసం యాజమాన్యం ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకొనేలా చూడాలని జీఎం అధికారులకు సూచించారు. బొగ్గు రవాణాలో ఇబ్బందులు కలగకుండా చూడాలని జీఎం సీహెచ్‌పీ అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి ఎస్వోటుజీఎం సురేందర్‌, రక్షణ అధికారి జయరాజ్‌, సీహెచ్‌పీ, సివిల్‌, ఐఈడీ, ఎఫ్‌అండ్‌ఏ విభాగాల అధికారులు దుర్గాప్రసాద్‌, నాగేశ్వర్‌రావు, చంద్రశేఖర్‌, శ్రీనివాసులు, ఓసీపీ-1,2 మేనేజర్లు ఉదయ్‌హరిజన్‌, రాజశేఖర్‌, పీఈలు శ్రీనివాస్‌, కేవీ రావుతోపాటు ఆయా విభాగాల అధికారులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.