close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

రైతు బజారు.. ఉల్లి బేజారు

ఈనాడు, నెల్లూరు: సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన ఉల్లిపాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.120 పలుకుతున్నాయి. ప్రజలు ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో కిలో రూ.25లకు పంపిణీ చేస్తున్నారు. దీంతో ఈ కేంద్రాల వద్ద ప్రజలు ఉల్లిపాయల కోసం బారులు తీరుతున్నారు. ఉదయాన్నే వచ్చి వరుసలో నిలబడుతున్నారు. నెల్లూరు నగరంలోని పత్తేఖాన్‌పేట రైతు బజారులోని దృశ్యాలివి. గంటల సమయం నిరీక్షించినా ఒక వ్యక్తికి కిలో మాత్రమే ఇస్తున్నారని కనీసం 2 కిలోలైనా పంపిణీ చేయాలని ప్రజలు వాపోతున్నారు. 

ఔరా.. ఇదేమి సిత్రం

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం ధరల మాదిరిగా రోజుకో ధర పలుకుతున్నాయి. ఉల్లి రకం, చిన్న, పెద్ద తేడా అంటూ.. రూ. 80 నుంచి 100లకు పైగా విక్రయిస్తున్నారు. దీంతో కూరల్లో ఉల్లి కరవు అవుతోంది. ఇక హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఉల్లిపాయలు కనిపించడం లేదు. ఇక పేదవారి పరిస్థితి సరే సరి. ఇటీవల ఎక్కడ చూసినా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఉల్లి లేదని బోర్డులు పెడుతున్నారు. తాజాగా నెల్లూరు నగరంలోని ట్రంకురోడ్డులోని ఓ హోటల్‌లో ఇలాగే బోర్డు పెట్టేశారు. ‘చపాతి, పరోట, చైనీస్‌ పరోట, చోళాపూరీలకు ప్రస్తుతం ఆనియన్‌ నిలిపివేయడమైనది’ మని సూచిస్తూ బోర్డు పెట్టారు. దీంతో ఉల్లి ప్రియులు నిరాశచెందుతూ ఆకలి తీర్చుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది.

 

 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.