close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

బయోడైవర్సిటీ పైవంతెన నాణ్యతపై నిపుణుల కమిటీ సమావేశం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: బయోడైవర్సిటీ పైవంతెన నిర్మాణ నాణ్యత పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ గురువారం సమావేశమైనట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ వెల్లడించారు. గతనెల 10న బయోడైవర్సిటీ పైవంతెన వద్ద సెల్ఫీలు తీసుకుంటున్న ఇద్దరు యువకులపైకి వేగంగా కారు దూసుకురావడంతో వారిద్దరు మృతిచెందారు. అదేనెల 23న అతివేగంతో వచ్చిన కారు వంతెన పైనుంచి కిందపడిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, మరో యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇలాంటి ఘటనలు తరచూ జరగడంతో తాత్కాలికంగా వంతెనను మూసివేసి నిర్మాణ నాణ్యతను పరిశీలించేందుకు నవంబర్‌ 25న ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు లోకేష్‌కుమార్‌ తెలిపారు. ఈ కమిటీ అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలిస్తుందన్నారు. ఒకటి రెండురోజుల్లో రాత్రివేళల్లో భిన్న సమయాల్లో ఈ కమిటీ సెల్ఫ్‌ టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించి నివేదికను బల్దియాకు సమర్పిస్తుందన్నారు. అనంతరం దీర్ఘకాలిక, తక్షణ భద్రత చర్యలను చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రత్యేక నిపుణుల కమిటీలో ప్రపంచ బ్యాంకు రోడ్డు భద్రత విభాగం సలహాదారు ఆచార్య ఎస్‌.నాగభూషన్‌రావు, రోడ్డు భద్రత, ట్రాఫిక్‌, ఇంజినీరింగ్‌ నిపుణుడు డా.టీఎస్‌రెడ్డి, ఓయూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌కుమార్‌, రోడ్‌ సేఫ్టీ ఆడిట్‌ ఎక్స్‌పర్ట్‌ ప్రదీప్‌రెడ్డి ఉన్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.