close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

సందేహమా.. మేము తీరుస్తాం..!

పది విద్యార్థుల కోసం ముందుకొచ్చిన ఉపాధ్యాయులు

చరవాణి ద్వారా సమాధానాలు చెప్పేందుకు సిద్ధం

న్యూస్‌టుడే, దేవరుప్పుల

ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులు

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల తేదీ వెల్లడైంది. మార్చి 19 నుంచి పరీక్షలు ప్రారంభం అని ప్రభుత్వం ప్రకటించటంతో విద్యార్థులలో ఆందోళన పెరిగింది. ఇప్పటికే మెరుగైన ఫలితాల సాధనకు విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు సాధారణ సెలవుల ఆలోచనకూ స్వస్తి పలికారు. విద్యార్థులు కూడా క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ప్రతి పాఠాన్ని ఒకటికి రెండు సార్లు పునశ్ఛరణ చేసి వివరించినా విద్యార్థులకు సందేహాలు వస్తూనే ఉన్నాయి. ఒకటికి రెండు సార్లు సందేహాలు తీర్చినా మళ్లీ మళ్లీ అడగలేక మథన పడే విద్యార్థులు అనేక మంది. వీరికి తోడుగా ఉండేందుకు పలువురు విషయ నిపుణులు ముందుకొచ్చారు. వీరంతా పాఠ్యాంశ బోధనలో ఆరితేరిన వారు. మరి కొందరు పాఠ్య పుస్తకాల సంపాదక మండలిలో సభ్యులు. రాష్ట్ర రిసోర్సు గ్రూపు సభ్యులు. పని ఒత్తిడి ఎంత ఉన్నా విద్యార్థులు తమ సందేహాలను తమతో చరవాణి ద్వారా ప్రస్తావిస్తే విపులంగా వివరించి సమాధానం చెప్పి సందేహాలను నివృత్తి చేస్తామని ‘న్యూస్‌టుడే’ ద్వారా ముందుకు వచ్చారు. ఆ ఉపాధ్యాయుల పరిచయం.


విషయం: తెలుగు

ఉపాధ్యాయుడి పేరు: చక్రవర్తుల శ్రీనివాస్‌

పనిచేస్తున్నది: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, చర్లపల్లి

చరవాణి నంబరు: 80087 91827


విషయం: హిందీ

ఉపాధ్యాయుడి పేరు: మహ్మద్‌ గౌస్‌ పాషా

పనిచేస్తున్నది: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, రెడ్లవాడ

చరవాణి నెంబరు: 94904 53865


విషయం: ఆంగ్లం

పేరు: డాక్టర్‌ కొల్లి శ్రీనివాస రెడ్డి

పనిచేస్తున్నది: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, చర్లపల్లి

చరవాణి నంబరు 98664 60824


విషయం: గణితం

పేరు: కందాల రామయ్య

పనిచేస్తున్నది: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తాటికొండ

చరవాణి నంబరు: 99488 67665


విషయం: భౌతిక శాస్త్రం

పేరు: కాసం శశి కళాధర్‌

పనిచేస్తున్నది: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, పరకాల

చరవాణి నంబరు: 98665 60782


విషయం: జీవ శాస్త్రం

పేరు: అన్నావఝుల నరసింహమూర్తి

పనిచేస్తున్నది: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, పాలకుర్తి

చరవాణి నంబరు: 95508 46863


విషయం: సాంఘిక శాస్త్రం

పేరు: మొర్రి కనకయ్య

పనిచేస్తున్నది: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, పెద్ద కొడపాక

చరవాణి నంబరు: 94411 42664


పరీక్ష భయం పోగొట్టేందుకు..:

పబ్లిక్‌ పరీక్షలంటే ఉన్న భయం తొలగించడం, ఆహ్వానిస్తే చాలు సొంత ఖర్చుల మీద పాఠశాలకు వచ్చి విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపే హితవచనాలు చెప్పడానికి సిద్ధం

మనో వైజ్ఞానిక నిపుణుడి పేరు: బ్రహ్మాండభేరి సోమనాథ రాజు

పనిచేస్తున్నది: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, పాలకుర్తి

చరవాణి నంబరు: 99892 91954


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.