close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

పవర్‌ బ్యాంకులు, హెల్మెట్లు, పెన్నులు నిషిద్ధం..

అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు
సాయంత్రం 4 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతి
భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌ నేపథ్యంలో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సూచనలు

ఈనాడు, హైదరాబాద్‌: పవర్‌ బ్యాంకులు, హెల్మెట్లు, పెన్నులు  స్టేడియంలోకి అనుమతించబోమని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ ఎం.భగవత్‌ స్పష్టం చేశారు. మొబైల్‌ ఫోన్స్‌, ఇయర్‌ ఫోన్స్‌ను అనుమతిస్తామని వివరించారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఇంటికెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని సూచించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయని వివరించారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నట్లుగా తెలిపారు. శుక్రవారం భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరగనున్న టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ను పురస్కరించుకుని ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ మైదానంలో భద్రతా, పార్కింగ్‌ ఏర్పాట్లను మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌తో కలిసి గురువారం విలేకరులకు వివరించారు. ట్రాఫిక్‌, శాంతి భద్రతలు, టీఎస్‌ఎస్పీ, ఆక్టోపస్‌, మౌంటెడ్‌ పోలీస్‌, ఎస్‌బీ, సీసీఎస్‌, సీసీఆర్బీ, ఏఆర్‌ తదితర విభాగాలకు చెందిన 1800 భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. స్టేడియంలో ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టేందుకు ప్రత్యేకంగా 300 సీసీ కెమెరాలు, జాయింట్‌ కమాండ్‌, కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కర్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా షీ బృందాలను రంగంలోకి దించనున్నట్లుగా వివరించారు. తినుబండారాలను స్టేడియంలో అధిక ధరలకు విక్రయించకుండా నిరోధించేందుకు విజిలెన్స్‌ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని చెప్పారు. జేబు దొంగలపై ప్రత్యేక నజర్‌ పెట్టామన్నారు. ఎలాంటి పుకార్లను నమ్మొద్దని, ఏదైనా సమాచారముంటే డయల్‌ 100కు చేరవేయాలని సూచించారు.

నిషేధం..!
ల్యాప్‌టాపులు, కెమెరాలు, అగ్గిపెట్టె, బైనాక్యులర్లు, బ్యాటరీలు, బ్యానర్లు, సిగరెట్లు, బయటి ఆహార పదార్థాలు, నీళ్ల సీసాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సుగంధ ద్రవ్యాలు, స్టిక్‌ జెండాలు(జాతీయ జెండా మినహా), నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌లపై నిషేధం విధించారు.

పార్కింగ్‌ ఏర్పాట్లు..!
4900 ద్విచక్రవాహనాలు, 3900 కార్లను పార్కింగ్‌ చేసేందుకు వీలుగా పోలీసులు ఏర్పాట్లు చేశారు. మ్యాచ్‌ ముగిసేంత వరకు కూడా ఎల్బీనగర్‌, హబ్సిగూడ, ఈసీఐఎల్‌, కుషాయిగూడ, చర్లపల్లి నుంచి ఉప్పల్‌ ఎక్స్‌రోడ్డు వైపు వచ్చే భారీ వాహనాలను అనుమతించరు.
* కారు పాసులు కలిగిన ప్రేక్షకులు గేటు 1, 2 ద్వారా రామంతాపూర్‌ వైపు నుంచి వచ్చి స్టేడియంలోనే పార్కింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మోడర్న్‌ బేకరీ గేటు దగ్గర ద్విచక్రవాహనాలను పార్కింగ్‌ చేసుకోవాలి.
* దివ్యాంగులు రామంతాపూర్‌ నుంచి గేటు 3 ద్వారా ప్రవేశించొచ్చు. పార్కింగ్‌ ప్లేస్‌ బీలో వాహనాలను నిలుపుకోవాల్సి ఉంటుంది.
* ఇబ్రహీంపట్నం, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, బోడుప్పల్‌, మేడిపల్లివైపు నుంచి కేవీ స్కూల్‌ నుంచి హెచ్‌పీ పెట్రోల్‌ పంపు వరకు, రామంతాపూర్‌, అంబర్‌పేట్‌, కాచిగూడ, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌ నుంచి వచ్చే వాహనాలు ఈనాడు కార్యాలయం, అమ్మ భగవాన్‌ సేవాలయం, ఎల్‌జీ గోడౌన్‌ నుంచి ఎన్‌ఎస్‌ఎల్‌ భవనం, డీఎస్‌ఎల్‌ వార్టూ మాల్‌, సికింద్రాబాద్‌, తార్నాక, హబ్సిగూడ, నాచారం, కుషాయిగూడ నుంచి జెన్‌ప్యాక్‌, టీఎస్‌ఐలా, ఎన్‌జీఆర్‌ఐ గేటు నంబర్‌ 1 నుంచి 3 వరకు పార్కింగ్‌కు కేటాయించిన స్థలంలో వాహనాలను నిలపాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.