close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసులు దాడి, సీజ్‌

బాలాపూర్‌: కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకొని వస్తువులను సీజ్‌ చేశారు. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కథనం ప్రకారం.. విజయవాడ గుడివాడకు చెందిన శ్రీను, మోహనకృష్ణలు కర్మన్‌ఘాట్‌లోని శ్రీరమణ కాలనీలో ఉంటున్నారు. వీరు జిల్లెలగూడ రాఘవేంద్ర కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు. మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య, ఎస్సై మారయ్య, ఉదయ్‌భాస్కర్‌తో కలిసి గురువారం ఆ ఇంటిపై దాడి చేశారు. నూనె, నెయ్యిని కలిపి కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు. వంద ప్యాకెట్లు, 25 కల్తీ నెయ్యి డబ్బాలు, ఆయిల్‌ క్యాన్‌లు 7, నెయ్యి క్యాన్‌లు 3తోపాటు ఇతర సామగ్రిని సీజ్‌ చేశారు. వాటి విలువ మొత్తం రూ. 3 లక్షలు ఉంటుందని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.