close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

‘వేగం’గా సర్వే.. చర్యలు కరవే!

వేగ పరిమితిపై నోటిఫికేషన్‌ జారీ చేయని రవాణాశాఖ

కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్‌వేలపై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతించినా... హైదరాబాద్‌లోని బాహ్యవలయ రహదారిపై ప్రమాదాలు పెరుగుతున్నాయని, గరిష్ఠ వేగాన్ని 100 కిలోమీటర్లుగా నిర్ణయిస్తూ రవాణా శాఖ కొద్దినెలల క్రితం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇతర రహదారులపై కూడా ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశాలున్నాయి.

ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని బయోడైవర్సిటీ పైవంతెనపై గంటకు 105 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన కారు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి..అమాంతం కిందనున్న రోడ్డుపై పడి ఓ ప్రాణాన్ని బలితీసుకున్నాడు. అనంతరం  పోలీసు అధికారులు ఆ వంతెనపై గంటకు 40 కి.మీ వేగం మించొద్దని గరిష్ఠ వేగపరిమితిని ప్రకటించారు. వాస్తవానికి ఏ రోడ్డు మీద ఎంత వేగంగా వెళ్లాలో తెలిపే ఓ నివేదికను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఆర్నెల్ల కిందటే రవాణాశాఖకు సమర్పించినా ఇంత వరకూ నోటిఫికేషన్‌ జారీ చేయలేదు.

ఆదేశాలివ్వడంలోనూ ఆలస్యమే
మెట్రో నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులపై వేగ పరిమితి నిర్ణయిస్తూ ఏప్రిల్‌ 6, 2018న కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. వాహన సాంద్రత ఆధారంగా వేగపరిమితులను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించుకోవాలని చెప్పింది. ఆదేశాలొచ్చిన తొమ్మిది నెలలకు మేల్కొన్న రవాణాశాఖ.. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులతో వేగపరిమితిపై సర్వే చేయించింది.

మూడు కమిషనరేట్ల పరిధిలో పరిశీలన
నగర రోడ్లు, బాహ్యవలయ రహదారిపై ఎంత వేగం పాటించాలనే అంశాలపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మూడు నెలల పాటు సర్వే చేశారు. రహదారుల ఇంజినీర్లు, వాహనచోదకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. రహదారుల సామర్థ్యం, వాహనాల సాంద్రత, పాదచారులు, దారుల పక్కనున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులన్నీ పరిశీలించారు. రద్దీ, రద్దీలేని సమయాల్లో ఆ మార్గాల్లో వాహనాలు ఎంత వేగంతో వెళ్తున్నాయనే వివరాలూ సేకరించారు. అన్నీ బేరీజు వేసుకుని ఆ దారుల్లో ఎంత వేగం పాటించాలో శాస్త్రీయంగా నిర్ధారించి రవాణాశాఖ అధికారులకు నివేదిక ఇచ్చారు.

నోటిఫికేషన్‌ జారీ చేస్తే...
నగరాల్లో వేగపరిమితి నిర్దేశించేందుకు మోటారు వాహన చట్టం 112ను ఉపయోగించుకోవాలని కేంద్రం ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసి ఆదేశించింది. దీన్ని పరిశీలించి రవాణా శాఖ ఆయా రహదారులపై వేగ పరిమితులు నిర్దేశిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయాలి. హైదరాబాద్‌ రోడ్లపై ఆ వేగాన్ని సూచించేలా జీహెచ్‌ఎంసీ బోర్డులు ఏర్పాటు చేయాలి. వాహనచోదకులు ఈ పరిమితులు మించితే చట్టపర చర్యలు చేపట్టే వీలుంటుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.