close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

ఏడాదికోసారి ఎగిరొచ్చే ఆనందం..!

పుట్టినగడ్డపై ప్రవాసాంధ్రుల సందడి
సేవా కార్యక్రమాలకు కొంత సమయం
ఈనాడు, హైదరాబాద్‌

పిల్లలకు వేసవి సెలవులు వస్తే ఎంత సంబరపడతారో.. నవంబరు-డిసెంబరు వచ్చిందంటే ప్రవాస భారతీయులు అంతకుమించి సంబరపడతారు. అమెరికాలో ప్రస్తుతం ఇవి సెలవుల రోజులు. ప్రవాసాంధ్రులు జన్మస్థలాల బాట పడుతున్నారు. గ్రీన్‌ కార్డుతో అక్కడే స్థిరపడినవారి నుంచి.. విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్థుల వరకు ఇప్పటికే చాలామంది తెలుగు గడ్డపై అడుగుపెట్టేశారు. విదేశాల్లో నేర్చుకున్న విజ్ఞానం, ఆర్జించిన ధనంలో కొంత మాతృ దేశాభివృద్ధికి వెచ్చిస్తున్నారు. కొందరు పూర్తిగా సొంత రాష్ట్రానికి తిరిగొస్తుంటే.. మరికొందరు అక్కడ, ఇక్కడా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. బంధుమిత్రుల శుభకార్యాలకు హాజరవుతూ ఓపక్క సంతోషాన్ని పంచుకుంటూనే.. మరో పక్క సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ సేవాభావాన్ని చాటుతున్నారు.

సంపన్న దేశం అమెరికాలో ఉద్యోగమంటే ఆర్థిక స్థిరత్వం.. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. అగ్రరాజ్యంలో చదువుకోవడమంటే నైపుణ్యాల్లో ఒక మెట్టు పైకెదిగినట్లే.. అందుకోసం లక్షలాది రూపాయలు అప్పుచేసి యూఎస్‌కు రెక్కలు కడుతున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు సైతం తమ పిల్లలను అక్కడికి పంపిస్తున్నాయి. మన దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి వెళుతున్న వారి సంఖ్యే అత్యధికంగా ఉంది. మనవారికి అమెరికా వలసలధామంగా మారింది. అక్కడి విశ్వవిద్యాలయాల్లో చదివిన వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండటం వల్ల గ్రాడ్యుయేషన్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం వెళుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. చదువు పూర్తికాగానే అక్కడే ఉద్యోగం లభిస్తే జీవితంలో స్థిరపడ్డామన్న భావం.. తదితర సానుకూల అంశాలతో మనవారు భారీగా వలస వెళుతున్నారు.


డిసెంబరు 10 నుంచి 29 వరకు కార్యక్రమాలు
- పరమేశ్‌ భీంరెడ్డి, అధ్యక్షుడు, ఆటా
అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) తరఫున డిసెంబరు 10-29 వరకు తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. వైద్య శిబిరాలు, యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం, ఉద్యోగ మేళాలు వీటిలో ఉన్నాయి.

 


 

42 ఏళ్లుగా సేవాకార్యక్రమాలు
- సతీష్‌ వేమన, మాజీ అధ్యక్షుడు, తానా
తానా 42 ఏళ్లుగా అమెరికాలో, ఇండియాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సెలవుల్లో స్వరాష్ట్రంలో వేర్వేరు సామాజిక కార్యక్రమాలు చేపడుతుంటాం. హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి, వేర్వేరు ఫౌండేషన్లకు చేయూతనందించాం. తెలుగు భాష పరిరక్షణకు సదస్సులు నిర్వహిస్తున్నాం.


 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.