close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

పరిశ్రమిస్తున్నారు..!!

● టీఎస్‌-ఐపాస్‌తో సత్వర అనుమతులు

రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిన జిల్లా

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌

పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి సమీపంలో టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఏర్పాటు చేసిన సోలార్‌ పవర్‌ జనరేషన్‌ ప్లాంట్‌

పరిశ్రమ స్థాపించి.. ఉపాధి కల్పించాలనే ఆలోచన కలిగిన వారు తమ ఆశయాన్ని నెరవేర్చుకోవడం చాలా కష్టం. అలాగే అనుమతులు పొందేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడేవారు.. మధ్యలోనే తమ లక్ష్యాన్ని వదిలేసేవారు ఇది గతం. ప్రస్తుతం అలాంటి లక్ష్యం.. ఆశయం ఉన్న వారికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఆసక్తిగల వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రాజెక్టు అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం (టీఎస్‌ ఐపాస్‌) విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకునే వారు నిబంధనల ప్రకారం అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని ఇండస్ట్రియల్‌, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు విచారిస్తారు. అన్ని సక్రమంగానే ఉంటే 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నారు. లేకుంటే దరఖాస్తును తిరస్కరిస్తారు. టీఎస్‌-ఐపాస్‌ అమలులోకి వచ్చిన తర్వాత మహబూబాబాద్‌ జిల్లాలో పారిశ్రామిక రంగంలో రాణించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికారులు కూడా ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా అన్ని విధాలుగా విచారణ చేసి అనుమతులు ఇస్తున్నారు. దాంతో రాష్ట్రంలోనే మూడో విభాగంలో జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో కలెక్టర్‌ శివలింగయ్య, జిల్లా ఇన్‌ఛార్జి జీఎం నరసింహామూర్తి హైదరాబాద్‌లో మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

241 దరఖాస్తులుకు 223 అనుమతులు..

జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. పరిశ్రమలు స్థాపించడం కోసం ఐదేళ్లలో 241 మంది దరఖాస్తు చేస్తున్నారు. అధికారులు పరిశీలన చేసిన 223 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చారు. ఇందులో 162 యూనిట్లలో కొన్ని ప్రారంభం కాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని రూ.511.43 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ యూనిట్ల ద్వారా 2,085 మందికి ఉపాధి అవకాశం లభించనుంది. ప్రారంభమైన కొన్ని పరిశ్రమల్లో కొందరికి ఉపాధి కూడా లభిస్తోంది. అనుమతులు ఇచ్చే ముందు పలుమార్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.