close

బుధవారం, జనవరి 29, 2020

ప్రధానాంశాలు

మేడారం

విధులు.. విచారం

మహిళా కండక్టర్లకు విధుల కేటాయింపులో గందరగోళం

పాతపద్ధతిలోనే పనిచేస్తామంటున్న మహిళలు

రాత్రి 8 గంటలకు ముగింపుపై తర్జనభర్జన

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌

డబిడ్డలు రాత్రివేళ విధుల్లో ఉండొద్ధు. 8 గంటల వరకే విధులను ముగించుకొని ఇంటికెళ్లాలి.. గురువారం నుంచి ఆర్టీసీ డిపోల్లో అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించినా నిజామాబాద్‌ రీజియన్‌లో విధుల కేటాయింపులో స్పష్టత లేకుండా పోయింది. సీఎం ఆదేశాలను అమలు చేయడానికి పక్కా ప్రణాళికను తయారు చేయాల్సిన అధికారులు కొర్రీలు పెట్టడానికి, ఉన్న అవకాశాలకు గండి కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారుల తీరుతో మళ్లీ పాత పద్ధతిలోనే విధులు నిర్వహిస్తామని మహిళా ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆరు బస్సు డిపోలున్నాయి. 670 బస్సులు, 2800 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో మహిళా కండక్టర్లు 318 మంది ఉన్నారు. నిత్యం మహిళా కండక్టర్లు 150 నుంచి 160 రూట్లలో విధులు నిర్వహిస్తారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు జిల్లాకు చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో డ్యూటీ చేసేందుకు ఇష్టపడతారు. సీనియర్‌ కండక్టర్లు ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రధాన రూట్లలో పని చేస్తుంటారు.

విధుల కేటాయింపు ఇలా..

రాత్రి విధుల నుంచి మహిళలను తప్పించడానికి చేసే కసరత్తు గందరగోళంగా మారింది. మహిళా ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉందని వాపోతున్నారు. రాత్రి 8 గంటల వరకు విధి నిర్వహణ పూర్తయ్యేటట్టు విధులు కేటాయించకుండా అధికారులు అస్తవ్యస్త విధానాన్ని చేపట్టారు. దీంతో వేగలేక పాత పద్ధతినే పని చేస్తామని అధికారులకు చెబుతున్నారు. కొంతమంది మహిళా కండక్టర్లు లిఖితపూర్వకంగా రాసి ఇస్తామని చెబుతున్నారు.

ఆర్టీసీలో మూడు రకాల విధులు

ఒకటి.. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 8 గంటల డ్యూటీ ఉంటుంది. ఇలా పని చేసిన వారు ప్రతి రోజు విధులకు రావాల్సి ఉంటుంది.

రెండోది.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసి అదనంగా మూడు గంటల ఓటీ చేస్తారు. ఇలా చేసేవారికి డబ్బులిస్తారు. మరుసటి రోజు విధులకు రావాల్సి ఉంటుంది.

మూడోది.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల కంటే ఒక గంట ఎక్కువ చేసినా మరుసటి రోజు విధులకు రానవసరం ఉండదు. దీనిని మహిళా కండక్టర్లు ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇలా చేయడంతో ఒకరోజు విశ్రాంతి దొరుకుతుందని చెబుతారు.

అధికారుల తిరకాసు

నిబంధనల ప్రకారం ఉదయం ఆరు గంటలకు విధుల్లో చేరి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే 8 గంటలవుతుంది. ఇలా వేయడం కుదరదని అధికారులు చెబుతున్నారు. ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసి తిరిగి ఉదయం మళ్లీ విధుల్లో చేరాలని అధికారులు చెబుతున్నారు. ఇలా తిరకాసు పెట్టడంతో మాకు కుదరదు.. గతంలో ఎలా ఉందో అదే పద్ధతిలో డ్యూటీలు చేస్తామంటూ మహిళా ఉద్యోగులు సిద్ధపడుతున్నారు.

ఆర్టీసీ ఆర్‌ఎం సోలోమాన్‌

ఈ డ్యూటీలు కేటాయించడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది. అన్ని డిపోల్లో ఉన్న మహిళలు, వారి వివరాలు సేకరిస్తున్నాం. త్వరలో డ్యూటీలు కేటాయిస్తాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.