close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

అగ్ని సాక్షిగా.. అడ్డు తొలగించుకుంది

వనస్థలిపురం, న్యూస్‌టుడే: పరాయి వ్యక్తితో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ మత్తులో కట్టుకున్న భర్తను సైతం వదిలించుకోవాలని భావించిన ఆమె ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పింది. పథకం ప్రకారం ఆ ప్రియుడు ఆమె భర్తను సజీవ దహనం చేశాడు. ఇద్దరూ కలిసి ఆ ఘటనను ప్రమాదంగా నమ్మేలా చేశారు. మృతుడి కుటుంబసభ్యుల అనుమానంతో తీగలాగితే డొంక కదిలింది. వనస్థలిపురం ఠాణా పరిధిలో ఇటీవల జరిగిన ఈ సంఘటన వెనుక దర్యాప్తులో నిందితులెవరో వెలుగుచూసినట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా  దొండ తిరుమలగిరి మండలం కుమ్మరిగడ్డ తండాకు చెందిన రమేశ్‌ (29) వనస్థలిపురం పరిధి బీఎన్‌రెడ్డినగర్‌లో ఓ గుడిసె వేసుకొని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. స్థానికంగా మేస్త్రీ పని చేస్తూ పోషిస్తున్నాడు. భార్య కూలి పని చేసేది. గతనెల 26న రమేశ్‌ తన గుడిసెలో సజీవ దహనమై కనిపించాడు. స్థానికులు తెల్లవారుజామున గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. షార్ట్‌సర్క్యూట్‌, లేదా అగ్ని ప్రమాదంగా పోలీసులు తొలుత భావించారు. సంఘటన స్థలంలోనూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే రమేశ్‌ కుటుంబసభ్యులు సందేహాలు వ్యక్తం చేశారు.

ఆధారాలు లేకుండా జాగ్రత్తపడి.. కూలీ పనులకు వెళ్లే రమేశ్‌ భార్యకు నల్గొండ జిల్లా డిండికి చెందిన మరో మేస్త్రితో పరిచయం ఏర్పడింది. అతడు కూడా రెండేళ్లుగా బీఎన్‌రెడ్డినగర్‌లోనే ఉంటున్నాడు. భార్య, పిల్లలు ఉన్నారు. రమేశ్‌తోనూ అతనికి పరిచయం ఉండడంతో తరచూ వీరి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. అదే ఆమెతో వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, తాను లేని సమయంలో అడ్డు తొలగించాలని ప్రియుడితో చెప్పింది. ఘటన జరగడానికి రెండు రోజుల ముందు పిల్లల్ని తీసుకొని అత్తారింటికి వెళ్లింది. గతనెల 26న రాత్రి రమేశ్‌ మద్యం తాగి గుడిసెలో గాఢ నిద్రలో ఉన్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత పెట్రోల్‌ బాటిల్‌తో అక్కడికి చేరుకున్న ప్రియుడు.. గుడిసెపై పోసి నిప్పంటించడంతో రమేశ్‌ సజీవ దహనమయ్యాడు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.