close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

తప్పులుంటే చర్యలు తప్పవు

సామాజిక తనిఖీలో అసిస్టెంట్‌ డీఆర్‌డీవో

తనిఖీ నివేదిక పరిశీలిస్తున్న అసిస్టెంట్‌ డీఆర్‌వో విద్యాచందన

ఏన్కూరు, న్యూస్‌టుడే: ఉపాధి పథకంలో పారదర్శకత ఉండేలా సామాజిక తనిఖీ, ప్రజావేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పథకం అసిస్టెంట్‌ డీఆర్‌డీవో విద్యాచందన పేర్కొన్నారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో 2018 జులై నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు నిర్వహించిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో పరిశీలన చేసిన అంశాలను మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన ప్రజావేదికలో డీఆర్‌పీలు వివరించారు. తొలుత విద్యాచందన మాట్లాడుతూ ఏ పథకంలో లేనివిధంగా ఉపాధి హామీలో నిర్వహించిన పనులపై తనిఖీ ఉంటుందన్నారు. ప్రతి అంశంపై తనిఖీ బృందం పరిశీలన చేస్తారని, లోటుపాట్లు, అవకతవకలున్నా సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్‌ఆర్‌పీ కొమరయ్యతోపాటు డీఆర్‌పీలు అన్ని పంచాయతీల్లో పరిశీలన నివేదికను సభలో వెల్లడించారు. చాలా పంచాయతీల్లో క్షేత్ర సిబ్బంది తమ విధులను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని, జాబ్‌కార్డు నమోదు, మస్టర్లలో తప్పులు, ఒకరికి బదులు ఒకరు పనికి వెళ్లడం ఇలా చాలా తప్పులు కనిపించినట్లు ఉన్నతాధికారులకు వివరించారు. ఇప్పటివరకు 12 విడతలు ప్రజావేదిక పూర్తయినా ప్రతిసారీ ఇదే తప్పులు కనిపిస్తున్నాయి. విధుల నిర్వహణలో ఎలాంటి మార్పులు రావడం లేదని సభలో స్పష్టంగా కనిపించింది. కొన్నిచోట్ల పనులు చేసేందుకు అర్హత లేని వ్యక్తులు కూడా హాజరయినట్లు తనిఖీలో తేలింది. చాలాచోట్ల కొలతలు తేడాలు, పనులు నిర్వహించకుండా ముందస్తు చెల్లింపులు, పే స్లిప్‌లు ఇవ్వకపోవడం, తీర్మానాలు లేకపోవడం లాంటివి డీఆర్‌పీలు చదివి వినిపించారు. నూకాలంపాడు పంచాయతీకి సంబందించి డీఆర్‌పీ నివేదిక ఇస్తుండగా ఆ గ్రామానికి చెందిన వ్యక్తులు పలు అంశాలను సభ దృష్టికి తెచ్చారు. తమకు పే స్లిప్పులు ఇవ్వడం లేదని, తక్కువ వేతనం వస్తుందని, తీర్మానాలు లేకుండా పనులు చేశారని అధికారులకు తెలిపారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదే పంచాయతీలో తనిఖీ బృందానికి ఇచ్చిన పలు కాగితాలపై వైట్‌నర్‌లు దిద్దటంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయలేదని, వాటికి సంబంధించి బిల్లులు డ్రా చేశారని డీఆర్‌పీ పేర్కొన్నారు. చాలా పంచాయతీల్లో హరితహారం ద్వారా నాటిన మొక్కలు సగానికి పైగా చనిపోయాయని, నర్సరీల నిర్వహణలోనూ చాలాచోట్ల మొక్కలు వాడిపోయినట్లు నివేదికలో చదివారు. సామాజిక వనాలు పెంపకంలో మొక్కలు వాడిపోతున్నాయన్నారు. తనిఖీ బృందం పలు అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీపీ అరెం వరలక్ష్మీ, జడ్పీటీసీ బాదావత్‌ బుజ్జి, విజిలెన్స్‌, నాణ్యతా అధికారులు సుజాత, సూర్యప్రకాశరావు, ఎస్‌టీఎం అజయ్‌కుమార్‌, ఎస్‌ఆర్‌పీ కొమరయ్య, ఎంపీడీవో గంటా వరప్రసాదరావు, ఏపీవోలు సూరయ్య, శ్రీరాణి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, కూలీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.