close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

గిరివికాస పథకం విధిగా అమలు చేయాలి
అధికారుల సమావేశంలో ఐటీడీఏ పీవో గౌతమ్‌
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో గౌతమ్‌

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో గిరివికాస పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌ అన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో గురువారం ఏజెన్సీ మండలాల ఎంపీడీవోలు, విద్యుత్తు ఏఈలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరివికాస పథకంలో మారుమూల ఏజెన్సీ గ్రామాలకు త్రీ ఫేజ్‌ విద్యుత్తు సరఫరాకు ఏర్పాట్లు చేయాలని, లబ్ధిదారులను గుర్తించి విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి లంబాడ తెగ వారికి రూ.1.38 కోట్లు, కోయ తెగ వారికి రూ.49 లక్షలు, ఎరుకల తెగ వారికి రూ.3 లక్షలు, నాయకపోడు తెగ వారికి రూ.12 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కామేపల్లి, సింగరేణి, ఏన్కూరు, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో ఈ పథకం అమలు చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించి గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. పకడ్బందీగా ఈ పథకం అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ రమేశ్‌, డీఆర్డీవో ఇందుమతి, ఐటీడీఏ ఎస్‌వో సురేశ్‌బాబు, ఏపీవో అనురాధ, ఎంపీడీవోలు, విద్యుత్తు ఏఈలు పాల్గొన్నారు.

గిరిజనులకు అత్యవసర వైద్య సేవలు అందాలి: మారుమూల ప్రాంతాల్లో నివసింసే గిరిజనులకు అత్యవసర వైద్య సేవలు అందించాలని, వైద్యులు, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండాలని పీవో గౌతమ్‌ అన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ నిధులతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలను వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించాలని అన్నారు. డీపీఎంలు వైద్య సేవలను పర్యవేక్షించాలని చెప్పారు. విద్యుత్తు కనెక్షన్లు ఇప్పించాలని ఏపీవోలను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో వైద్యులు, ఏఎన్‌ఎం సహా ఇతర పోస్టులు ఖాళీ లేకుండా భర్తీ చేయాలని చెప్పారు. నిర్మాణం పూర్తయిన ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలను స్వాధీనం చేసుకోవాలని డీపీఎంలను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.